
సాక్షి, ప్రకాశం : రాళ్లపాడు ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్తతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారా సంఘటనకు సంబంధించి విషయాలపై వైఎస్ జగన్ ఆరాతీశారు. రాళ్లపాడు నుంచి కామధేనువు ప్రాజెక్టుకు నీరు తరలించేలా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలంటూ రాళ్లపాడు ప్రాజెక్ట్ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. వివరాలు తెలుసుకున్న అనంతరం జీవోను రద్దు చేస్తామని ఎమ్మెల్యే మనుగుంట మహిధర్ రెడ్డికి వైఎస్ జగన్ హామీ ఇవ్వడంతో ఆయన ధర్నా విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment