
డాక్టర్ విశ్వశాంతికి గ్లోబల్ పీస్ అవార్డు
కందుకూరు : మండల వైద్యాధికారిణి డాక్టర్ విశ్వశాంతి గ్లోబల్ పీస్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం అమెరికా చికాగోకు చెందిన అమీర్ అలీఖాన్ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ వామనరావు చేతుల మీదుగా అంతర్జాతీయ గ్లోబల్ పీస్ 2016 అవార్డును ఆమెకు బహూకరించారు. రాష్ర్ట ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు సేవలందిస్తూ, జిల్లాలోనే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయడంలో మూడో స్థానంలో పీహెచ్‌సీని నిలిపడంలో ఆమె విశేష కృషి చేశారని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఆమె చేస్తున్న సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఫారూఖ్ అలీఖాన్, సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు.