గడ్డం మధుబాబు కుమారుడు కార్తికేయతో మాట్లాడుతున్న చంద్రబాబు
కందుకూరు రూరల్: కందుకూరులో బుధవారం తన సభలో ఒకరిపై ఒకరు పడిపోయి మృతి చెందిన ఓగూరు గ్రామానికి చెందిన గడ్డం మధుబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబుకు మృతుడి కుమారుడి నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది.
గురువారం ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు చంద్రబాబు ఆ గ్రామంలోని వారి ఇంటికి వెళ్లారు. మృతదేహానికి నివాళులర్పించి.. తల్లి చినకొండమ్మ, భార్య మాధవి, పిల్లలు కార్తికేయ, లికిత, సుశాంత్‌లతో మాట్లాడారు.
వారిని ఓదార్చుతున్న సమయంలో మధుబాబు కుమారుడు కార్తికేయ.. ‘మాకు డబ్బులు వద్దు.. నాన్నే కావాలి.. డబ్బులు ఎలాగోలా తెచ్చుకుంటాం.. నాకు నాన్న కావాలి’ అని అడిగాడు. ‘అది నా చేతుల్లో లేదు.. భగవంతుడు తీసుకెళ్లాడు. మిమ్మల్ని చదివిస్తాను. మీ బాగోగులను మేం చూసుకుంటాం’ అని చంద్రబాబు చెప్పారు.
‘చివరికి తెలుగుదేశంలో ఇలా కలిసిపోతావనుకోలేదు బిడ్డా’ అంటూ మృతదేహం వద్ద తల్లి బోరున విలపించింది. మృతుల్లో మరొకరైన కొండముడుసుపాలెంలోని కలవకూరి యానాది కుటుంబాన్ని కూడా చంద్రబాబు పరామర్శించారు. యానాది భార్య కాంతమ్మ, కుమారులను ఓదార్చి, తాము అండగా ఉంటామని చెప్పారు. (క్లిక్ చేయండి: కొంప ముంచిన చీప్ ట్రిక్స్.. ఈ ‘ఖర్మ’కు కర్త, క్రియ చంద్రబాబే!)
Comments
Please login to add a commentAdd a comment