కందుకూరు, న్యూస్‌లైన్: సహకార సంఘాలు బలోపేతమైనప్పుడే రైతులు, కూలీలకు ప్రయోజనాలు చేకూరుతాయని సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన కందుకూరులోని నవారు కిష్టమ్మ ఫంక్షన్ హాల్‌లో 60వ అఖిల భారత సహకార వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సహకార వారోత్సవాలను నెహ్రూ పుట్టిన రోజున ఇక్కడ జరుపుకోవడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో తుపానులతోపాటు ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారందరికీ పరిహారం ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు.
ధాన్యం కొనుగోలుకు 25 కేంద్రాలు: సబితారెడ్డి
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేయడానికి 25కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని మాజీ హోంమంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. అదనంగా పత్తి కొనుగోలు కేంద్రాలను ఇబ్రీహ ంపట్నం, తాండూరులో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
లోగో ఆవిష్కరణ
సహకార వారోత్సవాల లోగో, పుస్తకాన్ని మంత్రి వెంకటకృష్ణారెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సహకారశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని, సహకార ఫ్యూరీఫైడ్ వాటర్ సరఫరా కేంద్రాన్ని ప్రారంభించి సహకార సంఘాల ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ ఎంవీ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ బుస్సు చెన్నకృష్ణారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రవణ్‌కుమార్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు వెదిరె నర్సింగంరెడ్డి, అంజయ్యయాదవ్, వైస్ చైర్మన్ ఎస్.ఎల్లారెడ్డి, జేడీఏ విజయ్‌కుమార్, హాకా డెరైక్టర్ కృష్ణమూర్తి, రాష్ట్ర సహకార సంఘం యూనియన్ డెరైక్టర్ జి.శ్రీనివాసరావు, పీఏసీఎస్ డెరైక్టర్లు అక్కి యాదయ్య, బాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జంగయ్య, మల్లేష్, రాములు, యాదమ్మ, లక్ష్మమ్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, నాయకులు ఈశ్వర్‌గౌడ్, ఆర్.ప్రభాకర్‌రెడ్డి, కురుణాకర్‌రెడ్డి, కృష్ణనాయక్, ఇజ్రాయిల్, శివమూర్తి, రైతులు పాల్గొన్నారు.
సహకార సంఘాలు బలోపేతమవ్వాలి
Published Fri, Nov 15 2013 1:42 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement