మొక్కలపై చెట్టంత నిర్లక్ష్యం
జిల్లాను హరితవనంగా మారుస్తామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. ఈమధ్య కాలంలో మొక్కల పెంపకం పేరుతో భారీఎత్తున నిధులు ఖర్చు చేశారు. రోడ్లకు ఇరువైపులా, అటవీప్రాంతాలు, పాఠశాలల ప్రాంగణాలు...ఇలా అవకాశమున్న అన్ని ప్రాంతాల్లోనూ మొక్కలు నాటుతున్నట్లు ప్రకటించారు. ఇకపై ఎటుచూసినా పచ్చదనమే కన్పిస్తుందని గొప్పలు చెప్పారు. వాస్తవానికి చాలా మొక్కలు నర్సరీల్లోనే ఎండిపోయాయి. నాటిన మొక్కల పరిస్థితీ అంతే. అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామం వద్దనున్న జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) నర్సరీలో మొక్కలు ఎండిన దృశ్యాలివీ. నీళ్లు లేకపోవడంతో వీటిని ఎండబెట్టాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ట్యాంకర్లతోనైనా సరఫరా చేసి సంరక్షించాలన్న స్పృహ వారికి లేకపోయింది.
- జి.వీరేశ్, సాక్షి ఫొటోగ్రాఫర్