రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడ గేటు సమీపంలో గత మూడు రోజులుగా చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం.
కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడ గేటు సమీపంలో గత మూడు రోజులుగా చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డికి చెందిన పొలం వద్ద సోమవారం ఉదయం చిరుతపులిని చూసిన కొందరు స్థానికులు జంగారెడ్డికి సమాచారం అందించారు.
చిరుతపులి గత మూడు రోజులుగా ఆ ప్రాంతంలో కనిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఏనుగు జంగారెడ్డి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా చిరుతపులి సంచారంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.