రేపు జిల్లాకు షర్మిల
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఆమె మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
షర్మిల మంగళవారం ఉదయం పది గంటలకు యర్రగొండపాలెంలో, మధ్యాహ్నం 3 గంటలకు దర్శి నియోజకవర్గంలో, సాయంత్రం 6 గంటలకు పర్చూరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు. ఈ మూడు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల్లో ఆమె ప్రసంగిస్తారు. షర్మిలకు భారీగా స్వాగతం పలికేందుకు జిల్లా నేతలు, పార్టీ అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. ఈ బహిరంగ సభలకు భారీ ఎత్తున ఓటర్లు తరలి రావాలని, పార్టీ కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలకాలని నూకసాని బాలాజీ కోరారు.