వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమవారం మెతుకుసీమలో పర్యటించనున్నారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమవారం మెతుకుసీమలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆమె జిల్లాలో ఎన్నికల జనభేరి మోగించనున్నారు. షర్మిల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తెలంగాణలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆమె జిల్లాకు విచ్చేస్తుండడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులన్నీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమాయత్తమయ్యాయి. షర్మిల యాత్రకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసినట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్, నాయకులు అప్పారావు షెట్కార్, నల్లా సూర్యప్రకాశ్, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాసుగౌడ్ తెలిపారు.
వైఎస్సార్ సీపీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం విడుదల చేసిన జనభేరి షెడ్యూల్ ప్రకారం...
షర్మిల ఉదయం 11.30 గంటలకు నారాయణఖేడ్ చేరుకుంటారు. ఇక్కడ రాజీవ్ విగ్రహం చౌరస్తా వద్ద జరిగే బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
అక్కడి నుంచి పలు గ్రామాల మీదుగా ప్రచార యాత్ర కొనసాగిస్తూ సాయంత్రం 4 గంటలకు జహీరాబాద్ చేరుకుంటారు. అక్కడి ఈద్గా మైదానం ఎదుట నిర్వహించనున్న బహిరంగసభలో ఆమె ప్రసంగిస్తారు.
అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు సం గారెడ్డికి చేరుకుని స్థానిక నటరాజ్ థియేటర్ వద్ద జరిగే బహిరంగసభలో పాల్గొం టారు.
రాత్రి 7.30 గంటలకుపటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీపురం చేరుకోనున్న షర్మిల, ఇక్కడి సంత మైదానంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.