సంక్షేమ రాజ్యం స్థాపించుకుందాం | we are creating the welfare state | Sakshi
Sakshi News home page

సంక్షేమ రాజ్యం స్థాపించుకుందాం

Published Mon, Apr 14 2014 2:48 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

సంక్షేమ రాజ్యం స్థాపించుకుందాం - Sakshi

సంక్షేమ రాజ్యం స్థాపించుకుందాం

వైఎస్సార్ జనభేరి రోడ్‌షోలో ప్రజలకు వైఎస్ విజయమ్మ పిలుపు
 
 గుంటూరు: ‘‘తొమ్మిదేళ్ల నాటి పాలన మళ్ళీ తీసుకొస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఓట్లు అడగలుగుతారా? ఆయన హయాంలో రాష్ట్రానికి కనీసం నూరు కోట్ల ప్రాజెక్టు ఒక్కటైనా తెచ్చారా? ఒక ఇండస్ట్రీనైనా తెచ్చారా? అంటే ఏదీ లేదు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఒకటైనా నిలబెట్టుకున్నారా అంటే అదీ లేదు. ఇలాంటి వారిని నమ్మొద్దని మరొక్కసారి చెబుతున్నా. బాబు మాయమాటల్లో పడొద్దని మనవి చేస్తున్నా. అదే మనమైతే ఐదేళ్ళ మూడు నెలల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్ రాజశేఖరరెడ్డి గారి సువర్ణయుగాన్ని మళ్లీ తీసుకురాగలనే ధైర్యంతో మీ ముందుకు రాగలుగుతున్నాం.

ఓట్లు అడగగలుగుతున్నాం. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటి సువర్ణయుగం మాదిరిగానే సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేసుకుందాం. ఇందుకు రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టంకడదాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరు జిల్లాలో ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో వైఎస్ విజయమ్మ ప్రచారాన్ని కొనసాగించారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం తెలగవారిపాలెం నుంచి విజయమ్మ రోడ్‌షో ప్రారంభమై ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో కొనసాగించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement