రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీమ్ సిద్ధమైందనీ. నాయకులు, కార్యకర్తలు కలసి కట్టుగా పనిచేసి ఘనవిజయం సాధిస్తామని ఆ పార్టీ నేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వెల్లడించారు.
ఎన్నికలకు వైఎస్సార్ సీపీ టీమ్ రెడీ..
సమష్టి కృషితో ఘన విజయం సాధిస్తాం
ఆ పార్టీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త
ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వెల్లడి
చిలకలూరిపేట, న్యూస్‌లైన్:
రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీమ్ సిద్ధమైందనీ. నాయకులు, కార్యకర్తలు కలసి కట్టుగా పనిచేసి ఘనవిజయం సాధిస్తామని ఆ పార్టీ నేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వెల్లడించారు. చిలకలూరిపేటలో శుక్రవారం జరిగిన మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ జిల్లా కన్వీనర్
మర్రి రాజశేఖర్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. తన కుటుంబంలో ఒకరు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు గతంలోనే తెలిపామని, పూర్తి వివరాలను ఈ నెల 13న వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు.
సిటింగ్ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి తిరిగి నరసరావుపేట నుంచే పోటీ చేస్తామని వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా విలేకరులు ప్రస్తావించగా అది ఆయన వ్యక్తిగత విషయమని, రాజకీయాలు, బంధుత్వం వేరని అయోధ్య పేర్కొన్నారు. తనది రాజకీయ కుటుంబమని, ప్రజా సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నరసరావుపేట లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో విభేదాలు లేవన్నారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా అవి సర్దుకుంటాయన్నారు.