
సాక్షి, విజయవాడ: కుల రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తప్పు ఎవరు చేసిన శిక్ష తప్పదన్నారు.‘‘ ప్రమాదం జరిగినప్పుడు బాధితులను పరామర్శించాల్సిన చంద్రబాబు హైదరాబాద్‌లో దాగున్నాడు. చంద్రబాబు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎందుకు ఉంటుంది. ఆయనకు అందరూ సమానమే. రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం వలనే 10 మంది ప్రాణాలు కోల్పోయారని’’ జోగి రమేష్ ధ్వజమెత్తారు. (చదవండి: ఆయన ‘ఎల్జీమర్’తో బాధపడుతున్నారు)
చంద్రబాబుది ద్వంద్వ విధానం: ఎమ్మెల్యే సామినేని ఉదయభాను
స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ద్వంద్వ విధానాన్ని పాటిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో యాజమాన్యాన్ని అరెస్ట్ చేయమని డిమాండ్‌చేసిన చంద్రబాబు.. రమేష్ ఆసుపత్రి ప్రమాదంలో యాజమాన్యాన్ని వెనకేసుకువస్తున్నారని విమర్శించారు. ఆయన పార్టీ నాయకుడు కాబట్టే డాక్టర్ రమేష్‌ను చంద్రబాబు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏ ముఖ్యమంత్రి చేయనంత సాయాన్ని ఎల్జీ పాలిమర్స్, స్వర్ణప్యాలెస్ ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ చేశారని ఎమ్మెల్యే సామినేని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment