వైఎస్సార్ సీపీ నేతలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావును కలిశారు.
విజయవాడ: వైఎస్సార్ సీపీ నేతలు జోగి రమేశ్, సామినేని ఉదయభాను, అరుణ్ కుమార్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావును కలిశారు. నందిగామ పర్యటన సందర్భంగా తమ పార్టీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డీజీపీని కోరారు. అకారణంగా తమ పార్టీ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించారని డీజీపీకి వివరించారు.