సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్సార్ ఆసరా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పొదుపు సంఘాల మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 60, 62వ డివిజన్లలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యఅతిధిగా హాజరై వైఎస్సార్ ఆసరా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీరో వడ్డీ, ఆసరా, చేయూత వంటి పథకాలతో సీఎం జగన్ పొదుపు సంఘాల మహిళలకు అండగా నిలిచారు. సెంట్రల్ నియోజక వర్గంలో ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో 130 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు ఇవ్వనున్నారు. మొదటి విడతలో రూ.28 కోట్లు జమచేశారు. మహిళల జీవన స్థితిగతులను మెరుగు పరచాలని సీఎం ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అభివృద్ధి పథంలో పాలన చేస్తుంటే ప్రతిపక్షాలు ఆటంకాలు సృష్టిస్తున్నాయి. వ్యవస్థలను మ్యానేజ్ చేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు' అని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. (దమ్ముంటే విచారణ చేయండి అన్నారు)
►కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణం నకాశి బజార్లో 12, 13 వార్డు సచివాలయాల్లో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పాల్గొన్నారు. కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పట్టణంలో 740 స్వయం సహాయక సంఘాలకు 6 కోట్ల రూపాయల చెక్కును పంపిణీ ప్రభుత్వ విప్ ఉదయభాను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సామినేని వెంకట కృష్ణ ప్రసాద్, తన్నీరు నాగేశ్వరరావు, ముత్యాల వెంకటాచలం, తుమ్మల ప్రభాకర్, కటారి హరిబాబు పాల్గొన్నారు.
►పెనమలూరులో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన డ్వాక్రా మహిళలు... సీఎం వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాము అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment