వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యునిగా చంద్రశేఖర్
♦ ప్రధాన కార్యదర్శిగా సామినేని
♦ యువజన విభాగం అధ్యక్షునిగా జక్కంపూడి రాజా నియామకం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సభ్యునిగా గుంటూరు జిల్లాకు చెందిన గుబ్బా చంద్రశేఖర్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం విడుదలైన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రశేఖర్ గతంలో ఏపీపీఎస్సీ సభ్యునిగా పనిచేశారు. కాగా కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానును రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి రాజాను రాష్ట్ర పార్టీ యువజన విభాగం అధ్యక్షునిగా, విజయవాడ వెస్ట్‌కు చెందిన పైలా సోమినాయుడును రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా జగన్‌మోహన్‌రెడ్డి నియమించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
విజయవాడ సిటీ అధ్యక్షునిగా రాధా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర విభాగం అధ్యక్షునిగా వంగవీటి రాధాకృష్ణను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయినట్లు పార్టీ కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.