72 గంటల బంద్ | 72-hour bandh | Sakshi
Sakshi News home page

72 గంటల బంద్

Published Fri, Oct 4 2013 12:58 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

72 గంటల బంద్ - Sakshi

72 గంటల బంద్

సాక్షి, విజయవాడ : తెలంగాణ నోట్ ఆమోదానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నుంచి 72 గంటల జిల్లా బంద్‌కు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ సమైక్యవాదులకు పిలుపునిచ్చారు. 65 రోజులుగా ఉవ్వెత్తున ఆందోళనలు ఎగసిపడుతున్నా కాంగ్రెస్ పార్టీ తోసిరాజని రాష్ట్ర విభజనకు మొగ్గుచూపడాన్ని వారు ఖండించారు.

కాంగ్రెస్ పార్టీ నమ్మకద్రోహానికి పాల్పడిందని విమర్శించారు. ఏపీ ఎన్జీవోలు కూడా 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు శుక్రవారం బంద్‌కు కాంగ్రెస్ పార్టీ జిల్లా, సిటీ కమిటీలు కూడా పిలుపునిచ్చాయి. భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు సాయంత్రం నాలుగు గంటలకు కార్యకర్తల అత్యవసర సమావేశం ఏర్పాటుచేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement