‘ఆంధ్రా నయీంలుగా దందాలు సాగిస్తున్నారు’ | ysrcp leader saminenu udaybhanu takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘ఆంధ్రా నయీంలుగా దందాలు సాగిస్తున్నారు’

Published Tue, Sep 27 2016 4:22 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ysrcp leader saminenu udaybhanu takes on chandrababu naidu

విజయవాడ: క్విట్ ఆంధ్రప్రదేశ్ ఉద్యమం పేరుతో చంద్రబాబు నాయుడును త్వరలోనే తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని వైఎస్ఆర్ సీపీ నేత సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఆందోళనలో పాల్గొనే విద్యార్థులను జైల్లో పెడతాననడం అమానుషమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు.

టీడీపీ శాసనసభ్యులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సామినేని ఉదయభాను విమర్శించారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కోడెల శివప్రసాదరావు తనయుడు ఆంధ్రా నయీంలుగా దందాలు సాగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రత్యేకహోదా సమావేశాలకు విద్యార్థులు హాజరైతే జైలుకు వెళ్లక తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లిదండ్రులను హెచ్చరించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement