బాబూ...యాత్రెందుకు : ఉదయభాను | Baboo ... yatrenduku: udayabhanu | Sakshi
Sakshi News home page

బాబూ...యాత్రెందుకు : ఉదయభాను

Published Thu, Sep 12 2013 2:16 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

Baboo ... yatrenduku: udayabhanu

విజయవాడ, న్యూస్‌లైన్ : తెలుగుదేశం అధినేత జిల్లాలో చేసిన ఆత్మగౌరవ యాత్ర ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కాలేదని... ఆయన ఎందుకు యాత్ర చేశారో స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. సీతారాంపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు యాత్రలోదివంగత మహానేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను, అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించటం తప్ప చేసిందేమి లేదన్నారు.

జస్టిస్‌చౌదరిలాగా ఉండాలని సూచిస్తున్న చంద్రబాబు ఆయన ఎలా ఉన్నారో చెప్పాలన్నారు. 1998లో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేశారని, దానికి ఆకర్షితుడైన బాబు 1999లో బీజేపీతో పొత్తుపెట్టుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే 2008లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని తెలిపారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే రాష్ట్ర విభజనకు అనుకూలమో లేదో స్పష్టం చేయాలన్నారు. లేనిపక్షంలో  ధైర్యం లేదని ఒప్పుకోవాలని కోరారు.

మీ ఎమ్మెల్యేలను, ఎంపీలను రాజీనామాలు చేయించకుండా ఎందుకు యాత్రను ముగిస్తున్నారో ప్రజలకు  చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి నిరసనల సెగ తగలటంతో అర్ధాంతరంగా యాత్రను ముగిస్తున్నారని తెలిపారు.  జగన్ సీఎం, రాహుల్ పీఎం అవుతారని చంద్రబాబే డిక్లరేషన్ ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే ఎలా ఉంటుందో అనేక సర్వేలు చెబుతున్నాయన్నారు. ఇరుప్రాంతాల్లో టీడీపీ అంతరించిపోతుందని సర్వేలు తేల్చాయని చెప్పారు.

పామర్రు నియోజకవర్గం  సమన్వకర్త ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ బుధవారంతో ముగియనున్న చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రలో ఎక్కడా సమైక్యాంధ్ర  పేరు కూడా ప్రస్తావించలేదన్నారు. ఆయన యాత్రను  ఆత్మస్తుతి యాత్రగా పేరు మార్చుకోవాలని విమర్శించారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నానని ప్రగల్భాలు పలకడం, మసిబూసి మారేడుకాయ రాజకీయాలు చేయడం మినహా.. నలభైరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాల గురించి ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు.

సమైక్యవాదులు అడ్డగిస్తుంటే వారిని  వైఎస్సార్ సీపీ కార్యకర్తలుగా  వర్ల రామయ్య, ఇతర నాయకులు చిత్రీకరిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం తమ పార్టీ కార్యకర్తలకు లేదన్నారు. మిట్టగూడెంలో టీడీపీలోని మరో గ్రూపుగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకున్న విషయాన్ని గమనించాలన్నారు. విభజన ప్రక్రియ ఆపడానికి టీడీపీ ఏ చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
రాష్ట్ర ప్రచారకమిటీ సభ్యుడు లంకా బాబు, కార్యాలయ కో-ఆర్డినేటర్ టి.ఆర్. అశోక్,  జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూరపనేని రామారావు, పార్టీ నాయకులు ప్రభల శ్రీనివాస్, ఇంజినీరింగ్‌విద్యార్థి జేఏసీ నాయకుడు దొడ్డా అంజిరెడ్డి  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement