సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందని.. రైతు అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం శాసనమండలిలో జరిగిన చర్చలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే విత్తనాల కొరత ఏర్పడిందని, వాళ్లు చేసిన పాపాన్ని తాము మోయాల్సి వస్తోందని విమర్శించారు. రాబోయే రోజుల్లో విత్తనాల సమస్య పునరావృతం కాకుండా సమగ్ర విత్తన విధానాన్ని తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, వడ్డీలేని రుణాలు, రుణమాఫీ అమలు చేయకపోవడం వల్ల రైతులకు ఈ పరిస్ధితి వచ్చిందని మండిపడ్డారు. కాగా నకిలీ విత్తనాలపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో విజిలెన్స్ దాడుల్లో భారీగా నకిలీ విత్తనాలు బయటపడుతున్నాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment