
సాక్షి, దూద్‌బౌలి(హైదరాబాద్): తనకు సలాం చేయలేదంటూ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తన చెంపపై కొట్టారని ఓ వ్యక్తి హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం...పంచ్ మొహల్లా ప్రాంతానికి చెందిన గులాం గౌస్ జిలానీ (45) శనివారం రాత్రి తన ఇంటి వద్ద ఉండగా... తన ఇంట్లోకి వెళుతున్న ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తనను చూసి సలాం చేయలేదంటూ తన చెంపపై కొట్టాడని హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతన్ని శనివారం రాత్రి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.బాధితుడి ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: నన్ను అడ్డుకుంటే పొడుచుకుంటా..
Comments
Please login to add a commentAdd a comment