చెన్నై:తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై తమిళగ వెట్రి కజగమ్(టీవీకే) అధినేత, హీరో విజయ్ ఫైర్ అయ్యారు.ఫెంగల్ తుఫాను సహాయక చర్యలపై విజయ్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శలు గుప్పించారు. తుఫాను రిలీఫ్‌లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ తాత్కాలికమైనవేనని,దీర్ఘకాలిక పరిష్కారాలేమీ చూపడం లేదన్నారు.
ఏదైనా విపత్తు జరిగినపుడు ఒక సంప్రదాయం లాగ కొన్ని ప్రాంతాలు సందర్శించి ఆహారం పంపిణీ చేయడం ఫొటోలు దిగడం తప్ప ఏమీ చేయడం లేదని ఫైరయ్యారు. ఇవి కూడా కేవలం మీడియా ఫోకస్ ఉన్నంతవరకేనన్నారు. తుపానుకు సంబంధించి ముందస్తు హెచ్చరికలున్నా నష్ట నివారణ చర్యలను ప్రభుత్వం ఎంతమాత్రం తీసుకోలేదన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే బీజేపీ ఏజెంట్లని ఎదురుదాడి చేయడం సర్వసాధారణమైపోయిందన్నారు.తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉండాలని టీవీకే క్యాడర్‌కు విజయ్ పిలుపిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment