వందల కోట్లు తీసుకుని.. లక్షలు విదిలిస్తారా
తుఫాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ హీరోలు ప్రకటిస్తున్న సాయం మీద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి వందల కోట్లు తీసుకునే హీరోలు.. విశాఖపట్నం కోసం కేవలం కొన్ని లక్షలు మాత్రమే ఇస్తారా అని ప్రశ్నించారు. ఉచితంగా వస్తాయి కాబట్టే బోలెడంత ప్రేమ కురిపించి, ప్రార్థనలు చేస్తున్నారని అన్నారు.
Am shocked tht stars who hav100s of crores frm people r gvng jst a few lakhs to vizag..Thy r gvng lots of love n prayers bcos they are free
— Ram Gopal Varma (@RGVzoomin) October 14, 2014
ఇక తుఫాను విషయంలో దేవుడి నిర్ణయాన్ని కూడా రాంగోపాల్ వర్మ కొంతవరకు ప్రశ్నించారు. ప్రకృతి విపత్తులు దేవుడు సృష్టించేవే అయితే.. ఇలాంటి విధ్వంసం సృష్టించి దేవుడు ఎలా ఆనందం పొందుతాడని వర్మ ప్రశ్నించారు. విశాఖపట్నంలో ఉన్న అందరూ పాపం చేసినవాళ్లేనా.. వాళ్లను ఆయన ఎందుకు శిక్షించాలనుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే చివర్లో మాత్రం.. మళ్లీ తనకంటే దేవుడికే బాగా తెలుస్తుందని, తాను కేవలం ఓ సామాన్య మానవుడినేనని వేదాంతం వల్లించారు. అప్పటివరకు అంతా బాగానే ఉంది. అయితే హీరోలు కనీసం ఆమాత్రం లక్షలైనా విరాళాలు ప్రకటించారు. రాంగోపాల్ వర్మ మాత్రం తాను ఎంత సాయం చేసేదీ ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అవతలి వాళ్ల మీద రాళ్లు వేసేటప్పుడు తన అద్దాల మేడ సంగతి చూసుకోవాలన్న విషయం వర్మకు తెలియదంటారా?
If a natural disaster is an act of God what pleasure does God take in such destruction?
— Ram Gopal Varma (@RGVzoomin) October 14, 2014
I can't believe that everybody in Vizag is a sinner that he wanted to punish everybody...but ofcourse God knws bettr and I am jst a commoner
— Ram Gopal Varma (@RGVzoomin) October 14, 2014