
యూపీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కంటే..
ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ తీరుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత డ్రైవ్‌లో.. తల్లికూతుళ్లు మరణించిన ఘటనను ప్రస్తావించారు బీఎస్పీ చీఫ్ మాయావతి. తాజాగా యూపీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కంటే.. తల్లీకూతుళ్ల మరణం ఘటనే వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచిందంటూ మండిపడ్డారామె.
బీజేపీ చేస్తున్న బుల్డోజర్ రాజకీయాలు అమాయకులైన పేదల ప్రాణాలు తీస్తున్నాయని, ఇది చాలా బాధకరమన్నారు. ఇలాంటి వాటివల్ల ప్రజలకు ఏం ప్రయోజనం చేకూరుతుందంటూ.. సోషల్ మీడియా వేదికగా యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తూ హిందీలో ట్వీట్ చేశారు. కాగా, బుల్డోజర్లతో అక్రమ కట్టడాలను కూల్చడంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ యోగి 'బుల్డోజర్ బాబాగా' ప్రజల నోళ్లల్లో నానుతుండటం గమనార్హం.
1. देश व खासकर उत्तर प्रदेश जैसे गरीबी, बेरोजगारी, महंगाई व पिछड़ेपन आदि से त्रस्त विशाल राज्य में भाजपा सरकार की लोगों को अति-लाचार एवं आतंकित करने वाली बुल्डोजर राजनीति से अब निर्दोष गरीबों की जान भी जाने लगी हैं, जो अति-दुखद व निन्दनीय। सरकार अपना जनविरोधी रवैया बदले। 1/2
— Mayawati (@Mayawati) February 15, 2023
(చదవండి: ఎవరైనా సీన్ క్రియేట్ చేస్తే నడుములు విరిగిపోతాయ్!: మధ్యప్రదేశ్ మంత్రి వార్నింగ్)