
సాక్షి,యాదాద్రిభువనగిరిజిల్లా:బీఆర్‌ఎస్‌పార్టీ, కేసీఆర్, కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి మరోసారి ఫైరయ్యారు. మేడిగడ్డ కూలినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిందన్నారు. యాదగిరిగుట్టలో శుక్రవారం(నవంబర్22) మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,సీతక్కలతో కలిసి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ‘ఆలేరు,భువనగిరి నియోజకవర్గాలకు తాగు నీరు ఇచ్చేందుకు కేసీఆర్‌కు చేతులు రాలేదు. కేసీఆర్ పాపాలు చేసిండు కాబట్టే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి శపించి ఫాంహౌజ్‌కు పంపించాడు.
కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు రేవంత్ సీఎం అయ్యేవాడు కాదని హరీష్‌రావు అంటున్నాడు. హరీష్‌రావుకి బుద్ది ఉండే మాట్లాడుతున్నాడా? మతి భ్రమించి బీఆర్ఎస్ నేతలు ప్రజా ప్రభుత్వంపై మాట్లాడుతున్నారు’అని కోమటిరెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment