Komtireddy Venkat Reddy
-
తెలంగాణలో బెనిఫిట్ షోలు బంద్?
'పుష్ప 2' కోసం బుధవారం రాత్రి ప్రీమియర్లు వేశారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లోనూ ఇలానే ముందస్తు షోలు వేశారు. ఊహించని విధంగా అక్కడికి ఆ రోజు హీరో అల్లు అర్జున్ రావడంతో ప్రేక్షకుల మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బన్నీ టీమ్‌పై కేసు కూడా నమోదైంది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కలెక్షన్స్.. హిందీలో బన్నీ బ్రాండ్ రికార్డ్!)ఇలా మహిళ మృతి చెందడంపై నిర్మాతలు స్పందించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని కూడా హామీ ఇచ్చారు. ఏదేమైనా ఇలా ఓ మహిళ చనిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై తెలంగాణలో రిలీజయ్యే కొత్త సినిమాలకు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇవ్వం అని సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. నగరంలో బెనిఫిట్ షోలు వేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కోమటిరెడ్డి అన్నారు. కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేం దుకు వచ్చినవారు తమ కుటుంబ సభ్యురా లిని కోల్పోవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు.ఇకపై తెలంగాణలో ఉదయం 7 గంటలకే తొలి షో ఉండే అవకాశముంది. అంతకంటే ముందు మాత్రం బెన్ఫిట్ ఉండవు. టికెట్ రేట్ల విషయంలోనూ ప్రభుత్వాలపై బాగానే విమర్శలు వచ్చాయి. సంక్రాంతికి రిలీజయ్యే కొత్త సినిమాల విషయమై ఈ రెండు అంశాల్లోనూ ప్రభావం గట్టిగానే ఉండొచ్చనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప 2' చూసిన రష్మిక) -
బీఆర్ఎస్పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
సాక్షి,యాదాద్రిభువనగిరిజిల్లా:బీఆర్ఎస్పార్టీ, కేసీఆర్, కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి మరోసారి ఫైరయ్యారు. మేడిగడ్డ కూలినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిందన్నారు. యాదగిరిగుట్టలో శుక్రవారం(నవంబర్22) మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,సీతక్కలతో కలిసి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ‘ఆలేరు,భువనగిరి నియోజకవర్గాలకు తాగు నీరు ఇచ్చేందుకు కేసీఆర్‌కు చేతులు రాలేదు. కేసీఆర్ పాపాలు చేసిండు కాబట్టే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి శపించి ఫాంహౌజ్‌కు పంపించాడు.కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు రేవంత్ సీఎం అయ్యేవాడు కాదని హరీష్‌రావు అంటున్నాడు. హరీష్‌రావుకి బుద్ది ఉండే మాట్లాడుతున్నాడా? మతి భ్రమించి బీఆర్ఎస్ నేతలు ప్రజా ప్రభుత్వంపై మాట్లాడుతున్నారు’అని కోమటిరెడ్డి మండిపడ్డారు. -
కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..
-
ఢిల్లీ వైపు ఉత్తమ్ చూపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో త్వరలో మార్పులు జరగబోతున్నాయి. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంకల్లా టీపీసీసీ అధ్యక్షుని మార్పుతో పాటు ఏఐసీసీ స్థాయిలో పలువురికి పదవులు లభించనున్నట్టు గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా తీసుకుంటారనీ, ఆయన స్థానంలో భువనగిరి ఎంపీ, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమిస్తారని తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టేనని, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్లు తుది పరిశీలనలో ఉన్నాయని, దీనిపై త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఉత్తమ్ సేవలను ఢిల్లీ స్థాయిలో ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఆయనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అవకాశమిచ్చి ఒకటి లేదా రెండు రాష్ట్రాలకు పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించనున్నట్టు తెలుస్తోంది. ఉత్తమ్‌తో పాటు ఒకరిద్దరు తెలంగాణ నేతలకు ఏఐసీసీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. కోమటిరెడ్డి.. ఖరారే! టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఖరారైనట్టేనని గాంధీభవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో ఆయన ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్‌లో.. తర్వాత ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొని మూడు మున్సిపాలిటీలపై పార్టీ జెండా ఎగురవేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే. ఆయన గతంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా.. ప్రస్తుతం కాంగ్రెస్‌తోనే సర్దుకుపోయి పనిచేస్తున్నారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో మెరుగైన ఫలితాలు సాధించారు. ఈ ఇద్దరు సోదరులు.. టీపీసీసీ పగ్గాలు ఇస్తే దీటుగా పనిచేస్తామని, పార్టీని అధికారంలోకి తెస్తామని చాలాకాలంగా పార్టీ అధిష్టానానికి చెబుతూ వస్తున్నారు. మరోవైపు వెంకటరెడ్డి లోక్‌సభకు ఎన్నికైనప్పటి నుంచీ కేంద్రంలోని పెద్దలందరినీ కలుస్తూ తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు నిధుల కోసం చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటూ సోనియాగాంధీకి విధేయుడిగా ముద్రపడిన ఆయనకు అవకాశమివ్వాలని అధిష్టానం దాదాపు నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం టీపీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఈ పదవుల్ని ఒకటి లేదా రెండుకు పరిమితం చేసి.. ఒక బీసీ, మరో ఎస్సీ నేతకు ఈ హోదా కల్పించవచ్చని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. రాహుల్ టీమ్‌లో రేవంత్! వాస్తవానికి, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగించే అంశాన్ని ఏఐసీసీ సీరియస్‌గానే పరిశీలించింది. రేవంత్ కూడా పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో తనకు అవకాశమివ్వాలని అధిష్టానాన్ని కోరారు కూడా. అయితే, రేవంత్‌రెడ్డి రాష్ట్ర పార్టీలో కీలక నాయకుడని, ఎన్నికలకు ముందు రేవంత్ అస్త్రాన్ని ప్రయోగించాలనే భావనతో ప్రస్తుతానికి ఆయనను రాహుల్ టీంలో నియమించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో యాత్రను ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ యాత్రను సమన్వయం చేసే బాధ్యతను రేవంత్‌కు అప్పగిస్తారని, ఆయనతో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు, ఏఐసీసీ కార్యదర్శులు ఎస్.సంపత్‌కుమార్, చల్లా వంశీచందర్‌రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్‌కు రాహుల్ టీంలో చోటు కల్పిస్తారనే చర్చ పార్టీవర్గాల్లో జరుగుతోంది. గీతారెడ్డికి కీలక పదవి మహిళా కోటాలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డికి ఏఐసీసీలో కీలక పదవి లభిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్‌గా ఉన్న ఆమెను కూడా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించనున్నట్టు సమాచారం. ఏఐసీసీ పదవుల రేసులో మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నేత, సీఎల్పీ మాజీ నాయకుడు కె.జానారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దామోదర రాజనర్సింహకు కూడా ఏఐసీసీ అనుబంధ విభాగాల్లో చోటు లభిస్తుందని సమాచారం. -
నా కల నెరవేరబోతోంది: కోమటిరెడ్డి
సాక్షి, నార్కట్‌పల్లి: నార్కెట్‌పల్లి మండలంలోని తన స్వగ్రామమైన బ్రాహ్మణవల్లంలలో జరుగుతున్న ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నందున తన కల నెరవేరబోతోందని అన్నారు. సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు 2018 ఫిబ్రవరిలో ట్రయల్ రన్ చేపడతారన్నారు. మంత్రి హరీష్‌రావు ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే సాగర్ ఆయకట్టు మాదిరి ఈ ప్రాంతం కూడా మార్పు చెందుతుందన్నారు. ఈయన వెంట మాజీ ఎమ్మెల్యే లింగయ్య, పశుల ఊసయ్య, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. -
ఫిబ్రవరి లోగా తెలంగాణ
కట్టంగూర్ , న్యూస్‌లైన్ :ఫిబ్రవరి 2014లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి సోమవారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మణవెల్లెంల కాలువ పనులు 70 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను 2014 డిసెంబర్ వరకు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అభివృద్ది పనులను వేగవంతమవుతాయని తెలిపారు. బ్రాహ్మణవెల్లెం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులు పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. సమన్యాయం అంటే ఏమిటో చెప్పకుండా ఢిల్లీలో దీక్ష చేపట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిచ్చోడని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత బీజేపీతో లోపాయకారిగా ఒప్పందం చేసుకొని తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్ర లు పన్నినా తెలంగాణను ఆపలేరన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో టీడీపీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లను కానుకగా ఇవ్వాలని కోరారు. నిమ్స్ ఆస్పత్రికి రూ.500 కోట్లు కేటాయించమని అడిగితే సీఎం కిరణ్ నిరాకరించారని తెలిపారు. తెలంగాణకు నిధులివ్వని సీఎంకు ఈ ప్రాంతాన్ని పాలించే హక్కు లేదన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సుంకరబోయిన నర్సింహ, పీఏసీఎస్ చైర్మన్ చెవుగోని సాయిలు, సర్పంచ్ మేడి కృష్టయ్య, నాయకులు పోగుల నర్సింహ, బీరెల్లి రామచంద్రయ్య, బూర్గు శ్రీను, మంగదుడ్ల వెంకన్న, గట్టిగొర్ల సత్తయ్య, ఎం. శేఖర్, మర్రి రాజు, రేకల శ్రీను తదితరులు పాల్గొన్నారు.