'పుష్ప 2' కోసం బుధవారం రాత్రి ప్రీమియర్లు వేశారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లోనూ ఇలానే ముందస్తు షోలు వేశారు. ఊహించని విధంగా అక్కడికి ఆ రోజు హీరో అల్లు అర్జున్ రావడంతో ప్రేక్షకుల మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బన్నీ టీమ్‌పై కేసు కూడా నమోదైంది.
(ఇదీ చదవండి: 'పుష్ప 2' కలెక్షన్స్.. హిందీలో బన్నీ బ్రాండ్ రికార్డ్!)
ఇలా మహిళ మృతి చెందడంపై నిర్మాతలు స్పందించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని కూడా హామీ ఇచ్చారు. ఏదేమైనా ఇలా ఓ మహిళ చనిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై తెలంగాణలో రిలీజయ్యే కొత్త సినిమాలకు బెన్‌ఫిట్ షోలకు అనుమతి ఇవ్వం అని సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. నగరంలో బెనిఫిట్ షోలు వేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కోమటిరెడ్డి అన్నారు. కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేం దుకు వచ్చినవారు తమ కుటుంబ సభ్యురా లిని కోల్పోవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు.
ఇకపై తెలంగాణలో ఉదయం 7 గంటలకే తొలి షో ఉండే అవకాశముంది. అంతకంటే ముందు మాత్రం బెన్‌ఫిట్ ఉండవు. టికెట్ రేట్ల విషయంలోనూ ప్రభుత్వాలపై బాగానే విమర్శలు వచ్చాయి. సంక్రాంతికి రిలీజయ్యే కొత్త సినిమాల విషయమై ఈ రెండు అంశాల్లోనూ ప్రభావం గట్టిగానే ఉండొచ్చనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?
(ఇదీ చదవండి: దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప 2' చూసిన రష్మిక)
Comments
Please login to add a commentAdd a comment