నా కల నెరవేరబోతోంది: కోమటిరెడ్డి | komatireddy project visit | Sakshi
Sakshi News home page

నా కల నెరవేరబోతోంది: కోమటిరెడ్డి

Published Tue, Dec 26 2017 9:24 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

komatireddy project visit - Sakshi

సాక్షి, నార్కట్‌పల్లి: నార్కెట్‌పల్లి మండలంలోని తన స్వగ్రామమైన బ్రాహ్మణవల్లంలలో జరుగుతున్న ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నందున తన కల నెరవేరబోతోందని అన్నారు. సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు 2018 ఫిబ్రవరిలో ట్రయల్‌ రన్‌ చేపడతారన్నారు. మంత్రి హరీష్‌రావు ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే సాగర్‌ ఆయకట్టు మాదిరి ఈ ప్రాంతం కూడా మార్పు చెందుతుందన్నారు. ఈయన వెంట మాజీ ఎమ్మెల్యే లింగయ్య, పశుల ఊసయ్య, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement