తెలంగాణ ప్రయోజనాల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం
తెలంగాణ ప్రయోజనాల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం
Published Sat, Aug 27 2016 11:53 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ: తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్కం సుమన్ తెలిపారు. శనివారం న ల్లగొండలోని టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్ రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలాగైతే పోరాటం చేశామో అదే ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పనిచేస్తామని చెప్పారు. హరిహరనాథులు అడ్డొచ్చిన ప్రాజెక్టులకు నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. అవి భాజ్య రాష్ట్రంలో ఆంధ్రాపాలకులకు తొత్తులుగా వ్యవహరించిన తెలంగాణ అగ్రనాయకులు ప్రాజెక్టులను అడ్డుకోవడం హాస్యా స్పందంగా ఉందన్నారు. ప్రాజెక్టుల్లో జరుగుతున్న అక్రమాలను వివరించేందుకు ప్రజల్లోకి వెళ్తామని చెబుతున్న కాంగ్రస్ నాయకులకు ఆ ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రాణిహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో రూ. 7వేల కోట్లు ఖర్చు చేసిన అప్పటి ప్రభుత్వం మొబౖలñ జేషన్ అడ్వాన్సుల పేరిట రూ.3,500 కోట్లు కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ నాయకులు కాజేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని కాగ్ కూడా తప్పుపట్టిందని...జలయజ్ఞాన్ని దన యజ్ఞంగా మార్చిన ఘనత కాంగ్రెస్ పాలకులది అని ఎద్దేవ చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు ప్రాజెక్టులను విమర్శించే నైతిక బాధ్యత లేదన్నారు. నల్లగొండ జిల్లాకు చుక్కనీరవ్వని పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఉత్తమ్ ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చిందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల నాటికి కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆ ర్ కంకణ బద్ధులై ఉన్నారని చెప్పారు.
Advertisement
Advertisement