
సాక్షి,హైదరాబాద్: ప్రశాంత్ కిషోర్ బీజేపీకి అవసరం లేదని బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పార్టీలోని బూత్ స్థాయి కార్యకర్త ఒక పీకేతో సమానమని మండిపడ్డారు. భారతదేశానికి కాదు.. ఉక్రెయిన్ కి కూడా కేసీఆర్ ప్రధాని అవుతారని సెటైర్లు వేశారు. తెలంగాణను వదిలేసి కేసీఆర్ పొలిటికల్ టూరిస్ట్లా తిరుగుతున్నాడని, ఢిల్లీ సీఎంతో సమావేశం అయినంత మాత్రాన ఆయన బీజేపీని ఏమీ చేయలేరని తెలిపారు.
కేసీఆర్ అవినీతిని దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే ఆయన ముఖంలో భయం కనిపిస్తోందన్నారు. యుద్ధం కేసీఆర్, బీజేపీ మధ్య కాదని తెలంగాణను కాపాడేందుకే మా పోరాటమని చెప్పారు.