
ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సాక్షి, కడప: సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ప్రత్యేక హోదాపై చర్చించి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. కడపలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా అప్పులు తీసుకొచ్చి విలాసాలకు ఖర్చు చేశారని మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులు ఆయనకు పట్టలేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. అఖిల పక్షం పేరుతో అనుకూల సంఘాలతో సమావేశాలు నిర్వహించుకుంటున్నారని విమర్శించారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆయనకు మద్దతు పలకడం లేదని చెప్పారు. ఈ నెల 11వ తేదీన విజయవాడలో సమావేశమవుతామని, ఆ రోజు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.