Ramakrishna K (CPI)
-
‘క్షుద్ర రాజకీయాలకు ఆయన బలి పశువు’
సాక్షి,తాడేపల్లి: టీడీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ రామకృష్ణ చీఫ్ గెస్ట్‌గా మాట్లాడినట్లుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీపీఐ రామకృష్ణ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఎన్నో ఉద్యమాలు వైఎస్సార్సీపీ చేపడితే ఏ ఒక్క రోజు కూడా రామకృష్ణ కలిసి రాలేదన్నారు. అమరావతి భూముల పోరాటాలపై, దళితులపై దాడుల వంటి విషయాల్లో ఏ ఒక్క రోజూ అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఈ రోజు దళితులు, మహిళలపై దాడి అంటూ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. భూస్వాములకు రామకృష్ణ మద్దతుగా నిలుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఏ ఒక్క రోజు కూడా ఆయన మాట్లాడలేదని ధ్వజమెత్తారు. ‘‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియానా లేక చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియానా’’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే జుగుప్సాకర రాజకీయాలకు ఆయన సాక్షిగా నిలుస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయనకు సీపీఐ వత్తాసు పలికిందని, బాబు హయాంలో దళితులపై దాడులు జరిగితే నోరెందుకు ఎత్తలేదని ఆయన ప్రశ్నించారు. (చదవండి: బాబు ప్రయోజనాల కోసమే రౌండ్‌టేబుల్ సమావేశం) కేవలం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే ఆ రౌండ్ టేబుల్ పెట్టినట్లు ఉందని ఆయన నిప్పులు చెరిగారు. చివరికి అమ్మ ఒడిని కూడా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు చేసే క్షుద్ర రాజకీయాలకు బలిపశువు అవుతున్నారు. వైఎస్ జగన్‌పై మతం ముద్ర వేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు నిజంగా ప్రజలలో సమస్య ఉంటే ఇలా పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం చేయించాల్సిన అవసరం ఏముంది...? ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. రాజ్యసభ ఇస్తానని రోడ్డు పైన నిలబెట్టిన విషయం వర్ల రామయ్య మర్చిపోయారా..? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చంద్రబాబు అంటే... ఆ దళితులను గుండెల్లో పెట్టుకున్నారు వైఎస్ జగన్. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని సుధాకర్ బాబు హితవు పలికారు. -
తినడానికి తిండి లేదు కానీ స్మార్ట్ ఫోనా?
సాక్షి, విజయవాడ : తినడానికి తిండి లేకున్నా.. వాడుకోవడానికి స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడిపై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరుగురి సభ్యులకు రాజ్యసభ పదవులు ఇచ్చారని, కానీ వారిలో ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ లేరన్నారు. అందరూ అగ్రకులస్తులేనని తెలిపారు. కర్నూల్లో కోట్ల కుటుంబం సీఎం చంద్రబాబును అర్థరాత్రి కలవడం.. అదేంటయ్యా అంటే భోజనానికి అని బుకాయిస్తూ, ప్రాజెక్టుల కోసమని చెబుతారని, కానీ కోట్ల అడిగిని ప్రాజెక్టులు.. రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటని అందరికి తెలుసన్నారు. జనసేన, వామపక్షాలు కలిసి ఎన్నికలకి వెళ్తాయని, సీట్ల సర్దుబాటును త్వరలోనే తేలుస్తామన్నారు. -
టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదు
-
‘విభజన హామీలపై దమ్ముంటే చర్చకు రండి’
సాక్షి, విజయవాడ : కడప స్టీల్ ప్యాక్టరీ సాధన ఉద్యమం తీవ్రతరం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయాల్సిందే అని అఖిలపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. కడపలో స్టీల్ ప్యాక్టరీ నిర్మించే వరకు ఉద్యమం ఆగదని వారు తెలపారు. ఉద్యమానికి సంఘీబావంగా సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ, జనసేన, కాంగ్రెస్, ఆమ్ అద్మి పార్టీల నేతలు, వివిధ ప్రజాసంఘాల నేతలు విజయవాడలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్టీల్ ప్యాక్టరీ రాయలసీమ ప్రాంత ప్రజల సమస్య మాత్రమే కాదు.. అది రాష్ట్ర ప్రజల సమస్య అని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ.. కడపలో స్టీల్ ప్యాక్టరీ నిర్మాణం చేపడతామని విభజన సమయంలో హామీ ఇచ్చారు. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు జరపాల్సిందేననని ఆయన పేర్కొన్నారు. ‘స్టీల్ ప్యాక్టరీ నిర్మాణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు. ఇది ఇప్పటి సమస్య కాదు..13వ షెడ్యుల్‌లో పొందుపరిచిన అంశం. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి. ఇప్పుడు టీడీపీ రాజకీయ నాటకం ఆడుతుందని’ ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు 80 శాతం హామీలు అమలు జరిపామని చెబుతున్నారు. వారికి అసలు విభజన హామీలపై అవగాహన లేనట్లుందని విమర్శుల గుప్పించారు. బీజేపీ నేతలు మీడియా సమక్షంలో విభజన హామీలపై చర్చిద్దాం.. దమ్ముంటే చర్చకి రావాలని రామకృష్ణ సవాలు విసిరారు. టీడీపీ ప్రజలు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. 29వ తేదిన కడపలో జిల్లాలో జరిగే బంద్‌కు పూర్తి మద్దతు తెలుపుతామన్నారు. అంతేకాక ఆ రోజు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలిపారు. విద్యార్థులు ఉద్యమంలో పెద్దెత్తున పాల్గొనేలా ఉద్యమాన్ని నిర్మించాలని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్, ఉత్తారాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ సాధించే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తి లేదని సీపీఎం రాష్ట్ర నేత సీహెచ్ బాబురావు స్పష్టం చేశారు. అవసరమైతే మరోసారి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామన్నారు. కడప జిల్లా బంద్‌కు పూర్తిగా సంఘీబావం ప్రకటిస్తూ ప్రత్యక్షంగా పాల్గొంటామని ఆయన తెలిపారు. బీజేపీ, టీడీపీ రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రజలతో ఆటలాడితే తగిన బుద్ధి చెబుతామని బాబురావు హెచ్చరించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో గతంలో జరిగిన ఉద్యమాన్ని కడప జిల్లా సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య గుర్తు చేశారు. అదే మాదిరి ప్రస్తుతం రాష్ట్రంలో కడప స్టీల్ ప్యాక్టరీ సాధన కోసం అలాగే ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. అనాడు 38మంది విద్యార్థుల ప్రాణత్యాగం చేశారు.. ఎటువంటి పోరాటానికైన మేము సిద్ధంగా ఉన్నామని ఈశ్వరయ్య అన్నారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో నిరహరదీక్షలు కాదు.. ఢిల్లీలో దీక్షలు చేయాలని ఈశ్వరయ్య హితవు పలికారు. -
వారిని ఆంధ్రాద్రోహులుగా ప్రకటిస్తాం
విజయవాడ: ప్రత్యేక హోదా ఉద్యమంలో కలిసి రాని వారిని ఆంధ్రా ద్రోహులుగా ప్రకటిస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలిపారు. ఐలాపురం కన్వెన్షన్ హాల్లో ప్రత్యేక హోదా సాధన సమితి భవిష్యత్ కార్యాచరణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చలసాని శ్రీనివాస్‌తో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర నేత వై వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ అప్పలనాయుడు, సదాశివరెడ్డి, విశ్వనాద్, రఫీ, రాయప్ప, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ..ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో వెయ్యికి పైగా కార్యక్రమాలు చేశామన్నారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి సాధన సమితి కమిటీలు ఏర్పాటు చేసి, పదిలక్షల కరదీపికల ప్రచురిస్తామని తెలిపారు. జూన్ 15 తరువాత విద్యార్థి సంఘాలన్నీ కలిసి విద్యా సంస్థల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఊరేగింపులు కూడా చేపడతామని చెప్పారు. జూలై నుంచి యూనివర్శిటీలకు బస్సు యాత్రను చేపట్టి, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని అన్నారు. కడప ఉక్కు..ఆంధ్రుల హక్కని, గిరిజన విశ్వవిద్యాలయం తదితర సంస్థల కోసం ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు చేపడతామని తెలిపారు. జాతీయ రహదారులు రాష్ట్రంలో ప్రవేశించే ప్రాంతాల్లో రహదారుల నిర్బంధిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హోదా కోసం కలిసి వచ్చే అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల మద్ధతుకు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, హోదా సాధన సమితి ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ..రాష్ట్రంలో బీజేపీ నెగెటివ్ ప్రచారం చేస్తోందని వ్యాఖ్యానించారు.‘ కేంద్రం అన్ని హామీలను నేరవేర్చిందని ప్రచారం చేస్తున్నారు. విభజన హామీల్లో ఏం నెరవేర్చారో చెప్పాలని సవాల్ చేస్తున్నాం. వెనుకబడిన జిల్లాలకు బుందేల ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని అన్నారు. రాజధాని నిర్మాణానికి కేవలం పదిహేను వందల కోట్ల నిధులు ఇచ్చి, దానికి కూడా యూసీలు ఇవ్వలేదు. సిగ్గులేకుండా బీజేపీ నాయకులు కేంద్రాన్ని సమర్ధిస్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కింది స్థాయి వరకు తీసుకు వెళ్లబోతున్నాం. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ ప్రజల్లో పడిపోతోంద’ని రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర నేత, వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..నయవంచన మాటలతో బీజేపీ ప్రజలను మోసగిస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని వ్యాఖ్యానించారు. హోదా కోసం విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తామని, సమస్య ఉన్న చోట్ల ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు. -
దర్యాప్తు జరిపి వాస్తవాలు బయట పెట్టాలి
-
ఏపీలో అవినీతి రాజ్యమేలుతోంది
సాక్షి, కడప: సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ప్రత్యేక హోదాపై చర్చించి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. కడపలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా అప్పులు తీసుకొచ్చి విలాసాలకు ఖర్చు చేశారని మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులు ఆయనకు పట్టలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. అఖిల పక్షం పేరుతో అనుకూల సంఘాలతో సమావేశాలు నిర్వహించుకుంటున్నారని విమర్శించారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆయనకు మద్దతు పలకడం లేదని చెప్పారు. ఈ నెల 11వ తేదీన విజయవాడలో సమావేశమవుతామని, ఆ రోజు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. -
‘మూడు పార్టీలతో సరికొత్త రాజకీయ వేదిక’
సాక్షి, అనంతపురం: సీపీఐ, సీపీఎం, జనసేనతో కలిసి సరికొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఆయన శనివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ, ఉత్తరాంధ్ర సమస్యలపై ఈ త్రయం పోరాటం చేస్తుందని ప్రకటించారు. ఇందుకు సంబంధించి తొలిసభను అనంతపురంలోనే ఏర్పాటు చేస్తామన్నారు. తమతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలిసి వస్తే ఆహ్వానిస్తామన్నారు. కడప జిల్లాలో తొలిసారిగా ఏప్రిల్ 6,7 తేదీల్లో సీపీఐ 26వ మహా సభలు నిర్వహించున్నట్టు వెల్లడించారు. మరో వైపు ప్రత్యేక హోదా విషయంలో మోదీ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని, అవిశ్వాసంపై చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీలో అంతర్గతంగా మోదీపై వ్యతిరేకత ఉండటం వల్లే ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. ఏప్రిల్ 5న పార్లమెంట్ చివరి రోజు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే బ్లాక్ డే పాటిస్తామన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజు సాయంత్రం లైట్స్ ఆపేసి చీకటి దినంగా పాటిస్తామని తెలిపారు. -
ఆ ఒప్పందాలపై బాబు వివరణ ఇవ్వాలి: సీపీఐ
విజయవాడ : టీడీపీకి, కేంద్రానికి మధ్య జరిగిన ఒప్పందాలపై ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు ప్రజలకు వివరణ ఇవ్వాలని సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ కోరారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..పోలవరం, అమరావతికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వానికి ఏపీ రాష్ట్రం అంటే చులకన భావం ఏర్పడిందని ఆరోపించారు. పోలవరం పెరిగిన అంచనాల ప్రకారం రూ.58 వేల కోట్లు కావాలని, కేంద్రం సహకరించకపోవడంపై టీడీపీ నేతలు నోరు ఎందుకు మెదపడం లేదని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వకుండా కేంద్రం కాలయాపన చేస్తోందని వ్యాఖ్యానించారు. 2018 కల్లా పోలవరం పూర్తవడం కష్టమేనని, ఈ నెల 16న సీపీఐ నేతృత్వంలో పోలవరాన్ని సందర్శిస్తామని తెలిపారు. అక్కడ జరుగుతున్న విషయాలను బహిర్గతం చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు పరచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. రేపు(శుక్రవారం) విజయవాడలో విద్యార్ధి సంఘాలతో సమావేశం నిర్వహించి, విభజన చట్టంలోని హామీల అమలు కోసం ఉద్యమాలు చేపడతామని తెలిపారు. -
‘చంద్రబాబు పగటి కలలు కంటున్నారు’
సాక్షి, విజయవాడ : సదావర్తి సత్రం భూములను రూ.22కోట్లకే కొట్టేయాలని తెలుగుదేశం పార్టీ యత్నించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జోక్యంతో ప్రభుత్వానికి రూ.60కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. సక్రమంగా వేలం నిర్వహించి ఉంటే ప్రభుత్వ ధర రూ.350 కోట్ల ఆదాయం వచ్చేదని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం తమకేనని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నంద్యాల, కాకినాడలో టీడీపీ నేతలు డబ్బులిచ్చి ఓట్లు వేయించుకున్న దుస్థితి చంద్రబాబుదన్నారు. వంశధార నిర్వాసితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న రామకృష్ణ... నిర్వాసితుల పరామర్శకు వెళ్లిన సీపీఎం మధును అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో భూ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వచ్చే నెల మూడ్రోజుల పాట భారీ ధర్నా చేపట్టనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. -
‘లంచాల రూపంలో కోట్లాది రూపాయలు’
అమరావతి: విశాఖ జిల్లాలో భూబకాసురులు పెట్రేగిపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. విశాఖ రూరల్, భీమునిపట్నం మండలాల్లో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎం చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. మధురవాడలో 10 ఎకరాల ప్రభుత్వ భూమికి టీడీపీ నాయకుడు మదమంచి రామకృష్ణ తప్పుడు పట్టా సృష్టించి అమ్మేశారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు లంచాల రూపంలో చేతులు మారాయని చెప్పారు. విశాఖ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో మధురవాడ, కొమ్మాది ప్రాంతాలకు సంబంధించిన భూ రికార్డులు టాంపరింగ్ అయినట్లు జిల్లా కలెక్టర్ పత్రికాముఖంగా చెప్పారని వివరించారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. భూబకాసురులపై, సహకరించిన ప్రభుత్వ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు వినియోగించాలని సూచించారు. -
కదంతొక్కిన అగ్రిగోల్డ్ బాధితులు
విజయవాడలో భారీ ప్రదర్శన ఏపీ ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డ సీపీఐ నేత రామకృష్ణ గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): అగ్రి గోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ వేగవంతం చేయాలని, తమ డిపాజిట్లు తిరిగి చెల్లించా లని కోరుతూ అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు విజయవాడ నగరంలో మంగళవారం కదం తొక్కారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపునందుకుని భారీ సంఖ్యలో బాధితులు నగరానికి వచ్చారు. వారి నినాదాలతో ధర్నాచౌక్ మార్మోగింది. తుమ్మలపల్లి కళా క్షేత్రం నుంచి ప్రారంభమైన బాధితుల ప్రదర్శన బందరురోడ్డు, ఏలూరు రోడ్డు, లెనిన్ సెంటర్ మీదుగా అలంకార్ సెంటర్ వరకు సాగింది. అనంతరం ధర్నా చౌక్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామ కృష్ణ మాట్లాడుతూ 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల సమస్య ఏపీ సీఎం చంద్రబాబుకు పట్టదా? అని ప్రశ్నించారు. బాధితుల రోద నలు అసెంబ్లీలో కూర్చున్న ఏపీ ఎమ్మెల్యే లకు, మంత్రులకు, సీఎంకు వినిపించడం లేదా? అని అడిగారు. ప్రభుత్వ పెద్దలకు కళ్లూ చెవులు లేవని ధ్వజమెత్తారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేంత వరకు బాధితులు విజయవాడ విడిచి వెళ్లొద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అగ్రిగోల్డ్ కస్ట మర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌర వా«ధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లా డుతూ అగ్రిగోల్డ్ ఖాతాదారులు రోడ్డున పడి ఏడుస్తుంటే.. ఆస్తులు కూడగట్టిన యాజ మాన్యం ఏసీ కార్లలో తిరుగుతోందని దుయ్య బట్టారు. వారిని అరెస్ట్ చేయకుండా ప్రభు త్వం తాత్సారం చేయడం చూస్తుంటే ఏపీ సీఎం అవ్వాస్ సోదరులతో లాలూచీ పడ్డారని స్పష్టమవుతోందన్నారు. బుధవారంలోగా బాబు స్పందించకపోతే సెక్రటేరియట్ ఎదుటే ఆత్మహత్యలకు సిద్ధమవుతామని హెచ్చరిం చారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సభలో మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీని వాస్, సీపీఎం నేత సీహెచ్ బాబూరావు, ఆప్ నాయకుడు పోతిన వెంకట రామారావు, లోక్‌సత్తా నేత భానుప్రసాద్, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు. -
'బాబు, వెంకయ్య ప్రజలను మోసం చేస్తున్నారు'
ఏలూరు : ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మోసం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏలూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లింలకు, గిరిజనులకు ప్రాతినిధ్యం లేదని మండిపడ్డారు. కొడుకుకు మాత్రం మంత్రి పదవి కట్టబెడుతున్నారని ఆయన బాబుకు చురకలంటించారు. ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి విశాఖలో ఆమరణ దీక్ష చేపడుతున్నట్లు రామకృష్ణ తెలిపారు. -
బీజేపీ, టీడీపీలపై పవన్ అసంతృప్తి!
విజయవాడ : బీజేపీ, టీడీపీ ప్రభుత్వ విధానాలపై సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారని సీపీఐ నేత రామకృష్ణ చెప్పారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌తో భేటీపై వివరణ ఇచ్చారు. (చదవండి : పవన్‌తో సీపీఐ నేతల కీలక భేటీ ) రాజకీయ పొత్తుల కోసం పవన్‌తో భేటీ కాలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ఏకం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై గురువారం పవన్ కల్యాణ్‌తో సీపీఐ నేతలు చర్చించిన విషయం తెలిసిందే. -
పవన్‌తో సీపీఐ నేతల కీలక భేటీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్‌తో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ భేటీకి ఏఐటీయూసీ ఏపీ కౌన్సిల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రావు కూడా హాజరయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు భూ సేకరణ కారణంగా ఉత్పన్నమవుతున్న సమస్యలు, నోట్లరద్దు తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించునట్లు జనసేన పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. భావసారూప్యత కలిగిన ప్రజా సమస్యలపై జనసేన, వామపక్షాలు కలిసి పోరాడే విషయం ఆలోచన చేసినట్లు రామకృష్ణ ప్రకటించారు. ఇది స్నేహపూర్వక భేటీ అని పవన్ పేర్కొన్నారు. సీపీఎం నేతలతో కలిసి మరోసారి పవన్‌తో భేటీ అవుతామని రామకృష్ణ తెలిపారు. -
‘సుజనా వ్యాపారిలా మాట్లాడుతున్నారు’
అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రద్దయిన కరెన్సీ నోట్లతో సమానమని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న సుజనా చౌదరి రాజకీయ నాయకునిలా కాకుండా వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ, 15 ఏళ్లు సాధిస్తామని టీడీపీలు హామీలు గుప్పించి ప్రజలకు ఆశలు కల్పించాయని రామకృష్ణ అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పార్టీలు మాట మార్చి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని వెంకయ్యనాయుడు అంటే, రద్దు అయిన నోటు అని సుజనా చౌదరి వ్యాఖ్యానించి వారి నోటి దురుసుతనాన్ని ప్రదర్శించడం సరికాదని రామకృష్ణ హితవు పలికారు. -
'మోదీతో పోరాడే సత్తా బాబుకు లేదు'
కదిరి (అనంతపురం) : 'ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పోరాడే సత్తా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదు. ఆయన ఎందుకో భయపడుతున్నారు. ఆ భయం కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. ప్యాకేజీనే బాగుందంటున్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే హోదా పొందిన రాష్ట్రాలు అభివృద్ధి చెందాయన్న విషయం టీడీపీ, బీజేపీ నాయకులు గ్రహించాలి. దగాకోరు చంద్రబాబు సర్కారుపై త్వరలోనే ప్రజా బ్యాలెట్‌తో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తాం' అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆయన మంగళవారం అనంతపురం జిల్లా కదిరి ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని వెంకయ్య అడిగితే.. కాదు 15 ఏళ్లు ఇవ్వాల్సిందేనని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఈ ఇద్దరు నాయుళ్లు కలిసి ఇప్పుడు హోదా అవసరం లేదని, ప్యాకేజీ సరిపోతుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. వెంకయ్యకు ఏమాత్రం సిగ్గు, శరం ఉన్నా తక్షణం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు పూర్తిగా కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందన్నారు. విద్య, వైద్యం వారి చేతికే అప్పగించారని విమర్శించారు. అభివృద్ధి మొత్తం అమరావతిలో కేంద్రీకృతం చేస్తున్నారన్నారు. రాజధానిని ఫ్రీజోన్‌గా పరిగణించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటకు రెయిన్ గన్ల ద్వారా ప్రాణం పోశానని ముఖ్యమంత్రి చెబుతున్న మాటల్లో ఏమాత్రమూ నిజం లేదన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
'పవన్‌పై వాళ్లు విమర్శలు చేయడం సిగ్గుచేటు'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యక హోదా కోసం సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి పోరాటం చేస్తామని సీపీఐ సీనియర్ నేత రామకృష్ణ పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అంశం తాజా పరిణామాలపై గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయని ఎంపీలు ఇప్పుడు సిగ్గు లేకుండా పవన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాచిపోయిన లడ్డూలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెరొకటి తింటున్నారని ఎద్దేవా చేశారు. ప్యాకేజీపై చంద్రబాబు రకరకాల ప్రకటనలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై చంద్రబాబు ఇప్పటికే ఐదు రకాల ప్రకటనలు చేశారని చెప్పారు. ఇకనుంచి ఏపీలో బీజేపీ నిర్వహించే ప్రతి బహిరంగ సభ వద్ద నిరసన తెలుపుతామని సీపీఐ నేత రామకృష్ణ హెచ్చరించారు. -
'వెంకయ్య మోసగాడిగా మిగిలిపోతారు'
విజయవాడ: తెలుగు ప్రజల దృష్టిలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మోసగాడిగా మిగిలిపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రూ. 2 లక్షల కోట్లు లబ్ది జరుగుతోందని వెంకయ్య చెబుతుంటే.. బాబు మాత్రం రూ. 8 వేల కోట్లు వస్తాయని అంటున్నారు. ఈ చర్యల వల్ల తెలుగు ప్రజల దృష్టిలో వెంకయ్యనాయుడు మోసగాడిగా మిగిలిపోతాడని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన దృతరాష్ట్ర పాలనను తలపిస్తోందని దుయ్యబట్టారు. బి కేటగిరి మెడికల్ సీట్ల భర్తీలో రూ. 500 కోట్ల మేర చేతులు మారయని ఆరోపించారు. ఈ అంశంపై మంత్రి కామెనేనితో బహరింగ చర్చకు సిద్ధమన్నారు. -
'చంద్రబాబు నిప్పు కాదు...తుప్పు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు నిప్పు కాదు..తుప్పు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన మాట్లాడుతూ...బాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పార్టీ ఫిరాయింపుల విషయంలో చంద్రబాబు తీరు ఆక్షేపనీయమని రామకృష్ణ మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగరి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై టీడీపీ దాడి చేయడం అమానుషమన్నారు. హైకోర్టు విభజన అంశాన్ని తక్షణమే పరిష్కారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలో అభివృద్ధి పేరుతో ఆలయాలను కూల్చడం సరికాదని రామకృష్ణ అన్నారు.