'వెంకయ్య మోసగాడిగా మిగిలిపోతారు'
'వెంకయ్య మోసగాడిగా మిగిలిపోతారు'
Published Fri, Sep 9 2016 2:38 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
విజయవాడ: తెలుగు ప్రజల దృష్టిలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మోసగాడిగా మిగిలిపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రూ. 2 లక్షల కోట్లు లబ్ది జరుగుతోందని వెంకయ్య చెబుతుంటే.. బాబు మాత్రం రూ. 8 వేల కోట్లు వస్తాయని అంటున్నారు. ఈ చర్యల వల్ల తెలుగు ప్రజల దృష్టిలో వెంకయ్యనాయుడు మోసగాడిగా మిగిలిపోతాడని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన దృతరాష్ట్ర పాలనను తలపిస్తోందని దుయ్యబట్టారు. బి కేటగిరి మెడికల్ సీట్ల భర్తీలో రూ. 500 కోట్ల మేర చేతులు మారయని ఆరోపించారు. ఈ అంశంపై మంత్రి కామెనేనితో బహరింగ చర్చకు సిద్ధమన్నారు.
Advertisement
Advertisement