కదంతొక్కిన అగ్రిగోల్డ్ బాధితులు
విజయవాడలో భారీ ప్రదర్శన
ఏపీ ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డ సీపీఐ నేత రామకృష్ణ
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): అగ్రి గోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ వేగవంతం చేయాలని, తమ డిపాజిట్లు తిరిగి చెల్లించా లని కోరుతూ అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు విజయవాడ నగరంలో మంగళవారం కదం తొక్కారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపునందుకుని భారీ సంఖ్యలో బాధితులు నగరానికి వచ్చారు.
వారి నినాదాలతో ధర్నాచౌక్ మార్మోగింది. తుమ్మలపల్లి కళా క్షేత్రం నుంచి ప్రారంభమైన బాధితుల ప్రదర్శన బందరురోడ్డు, ఏలూరు రోడ్డు, లెనిన్ సెంటర్ మీదుగా అలంకార్ సెంటర్ వరకు సాగింది. అనంతరం ధర్నా చౌక్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామ కృష్ణ మాట్లాడుతూ 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల సమస్య ఏపీ సీఎం చంద్రబాబుకు పట్టదా? అని ప్రశ్నించారు.
బాధితుల రోద నలు అసెంబ్లీలో కూర్చున్న ఏపీ ఎమ్మెల్యే లకు, మంత్రులకు, సీఎంకు వినిపించడం లేదా? అని అడిగారు. ప్రభుత్వ పెద్దలకు కళ్లూ చెవులు లేవని ధ్వజమెత్తారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేంత వరకు బాధితులు విజయవాడ విడిచి వెళ్లొద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అగ్రిగోల్డ్ కస్ట మర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌర వా«ధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లా డుతూ అగ్రిగోల్డ్ ఖాతాదారులు రోడ్డున పడి ఏడుస్తుంటే.. ఆస్తులు కూడగట్టిన యాజ మాన్యం ఏసీ కార్లలో తిరుగుతోందని దుయ్య బట్టారు.
వారిని అరెస్ట్ చేయకుండా ప్రభు త్వం తాత్సారం చేయడం చూస్తుంటే ఏపీ సీఎం అవ్వాస్ సోదరులతో లాలూచీ పడ్డారని స్పష్టమవుతోందన్నారు. బుధవారంలోగా బాబు స్పందించకపోతే సెక్రటేరియట్ ఎదుటే ఆత్మహత్యలకు సిద్ధమవుతామని హెచ్చరిం చారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సభలో మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీని వాస్, సీపీఎం నేత సీహెచ్ బాబూరావు, ఆప్ నాయకుడు పోతిన వెంకట రామారావు, లోక్‌సత్తా నేత భానుప్రసాద్, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.