
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం పోరాటమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దీక్షపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వయసైపోయాక పెళ్లి చేసుకున్న చందంగా చంద్రబాబు దీక్ష ఉందని ఎద్దేవా చేశారు. ‘ఇంతకాలం మోదీతో చంద్రబాబు కలసి ఉన్నారు. ఇప్పుడు దీక్షలు అంటున్నారు.
ఇది వయసైపోయాక పెళ్లి చేసుకున్నట్టుంది. దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వయసులో ఉండగా చంద్రబాబు మోదీతో గడిపారు. ఇప్పుడు బయటకొచ్చి దీక్ష చేస్తున్నారు’ అంటూ నారాయణ ఎద్దేవా చేశారు.