తుందుర్రులో పోలీస్ క్యాంప్స్ ఎత్తివేయాలి
Published Mon, Oct 3 2016 11:51 PM | Last Updated on Tue, Aug 21 2018 9:00 PM
భీమవరం : గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణంలో ఉన్న తుందుర్రులో పోలీస్ క్యాంప్‌లను తక్షణం ఎత్తివేసి పనులను నిలుపుదల చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పౌర హక్కుల సంఘం తరఫున ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులతో కలిసి సోమవారం భీమవరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కమిటీ సభ్యులు తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నల గరువు గ్రామాల్లో పర్యటించి అక్కడ చోటు చేసుకున్న ఘటనలపై నిజనిర్ధారణ చేసినట్టు ఆయన చెప్పారు. తుందుర్రులో గత 22 రోజులుగా 144 సెక్షన్ పెట్టి పెద్దెత్తున పోలీసులను మోహరించడంలో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిజనిర్ధారణకు వెళ్లిన తమ కమిటీపైనే నిర్భంధించి ఉన్నతాధికారులతో మాట్లాడేంత వరకూ అక్కడికి వెళ్లనీయమంటూ అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు. అక్కడి ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారని, ఎప్పుడూ గడపదాటని మహిళలు సైతం పోలీసు కేసులు,సెక్షన్ల గురించి మాట్లాడుతున్నారÆ టే వారిని పోలీసులు ఎంతగా వేధిస్తున్నారో అవగతమౌతుందన్నారు. ఫుడ్‌పార్కు యాజమాన్యంతో ప్రభుత్వం అధికారులు, కుమ్మక్కై చట్ట వ్యతిరేకంగా పార్కు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చంద్రశేఖర్ ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాల రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో పోలీస్ క్యాంప్‌లను ఎత్తి వేయాలని అక్కడ జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని నిష్పక్షపాతంగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని డిమాండ్ చేశారు. సమావేÔ¶ ంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి నంబూరి శ్రీమన్నారాయణ, జిల్లా కార్యదర్శి కేవీ రత్నం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement