
తుందుర్రులో ఉద్రిక్తత
భీమవరం: పశ్చిమగోదావరిజిల్లా భీమవరం మండలంలోని తుందుర్రులో ఉద్రిక్తత నెలకొంది. ఆక్వా ఫుడ్ పార్క్‌ను ముట్టడిస్తామని సీపీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ 144వ సెక్షన్ విధించి పోలీసులను భారీగా మోహరించారు. గ్రామానికి చెందిన ముగ్గురు నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. తుందుర్రుతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు అణువణువూ గాలిస్తున్నారు.