aqua food park
-
‘ఫిష్ ఆంధ్రా’తో ఇంటి ముంగిటకే మత్స్య ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: వినియోగదారుల ముంగిటకే చేపలు, రొయ్యల విక్రయ వాహనాలు (ఫిష్ వెండింగ్ వెహికల్స్) రానున్నాయి. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచేందుకు ఫిష్ ఆంధ్రా పేరిట ఆక్వా హబ్‌లు, వాటికి అనుబంధంగా రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై వాటిని ప్రజల ముంగిటకే చేర్చే ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా నిరుద్యోగ యువతకు 40 నుంచి 60 శాతం సబ్సిడీపై మొబైల్ త్రీ వీలర్ ఫిష్ వెండింగ్ కార్ట్స్, ఫోర్ వీలర్ మొబైల్ ఫిష్ అండ్ ఫుడ్ వెండింగ్ వెహికల్స్ అందజేస్తోంది. మూడు చక్రాల వాహనం ధర రూ.4 లక్షలు కాగా.. నాలుగు చక్రాల వాహనం ధర సైజును బట్టి రూ.12 లక్షల నుంచి రూ.23 లక్షలుగా నిర్ణయించారు. వీటిపై ఎస్సీ, ఎస్టీతోపాటు మహిళా లబ్ధిదారులకు 60 శాతం చొప్పున, ఇతరులకు 40 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. వాహనం ధరలో 10 శాతం లబ్ధిదారులు చెల్లిస్తే.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా సమకూరుస్తారు. తొలి విడతగా 450 వాహనాలు ఈ వాహనాలను సచివాలయ స్థాయిలో ఏర్పాటు చేస్తుండగా.. తొలి విడతలో 300 త్రీ వీలర్, 150 ఫోర్ వీలర్ వాహనాలు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. తొలి వాహనాన్ని మత్స్య శాఖ కమిషనర్ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామానికి చెందిన ఉప్పుల సుందరరావు అనే ఎస్సీ లబ్ధిదారునికి సోమవారం అందజేశారు. వాహనాల్లో ప్రత్యేకతలివే.. మూడు చక్రాల వాహనంలో 200 కేజీల మత్స్య ఉత్పత్తులను నిల్వ చేసుకోవచ్చు. 20 లీటర్ల సామర్థ్యం గల రెండు ఐస్ బాక్స్‌లు, వేయింగ్ మెషిన్, మైక్ సౌకర్యం, మత్స్య ఉత్పత్తులను డ్రెస్సింగ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఇందులో ఉంటాయి. నాలుగు చక్రాల వాహనంలో అయితే.. వాహన రకాన్ని బట్టి 2 నుంచి 8 టన్నుల వరకు నిల్వ ఉండేలా డిజైన్ చేశారు. అత్యాధునిక డ్రెస్సింగ్, రెడీ టూ ఈట్ కుకింగ్ చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. వీటిద్వారా లైవ్ ఫిష్, ఫ్రెష్ ఫిష్, రొయ్యలు, మేరినేటెడ్ అండ్ కుక్డ్ ప్రొడక్టŠస్ను రిటైల్, ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా అమ్ముతారు. స్నాక్స్, ఇన్స్టెంట్ కుకింగ్ ఫుడ్స్ కూడా వీటిలో ఉంటాయి. ఇదీ చదవండి: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం -
ముంచుకొస్తున్న ముప్పు!
-
పచ్చని పల్లెల్లో ఆక్వా చిచ్చు
-
‘ఆక్వా’ ఆందోళనపై పోలీసుల జులుం
-
‘ఆక్వా’ ఆందోళనపై పోలీసుల జులుం
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ఆక్వాఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు పరిసర ప్రాంత రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను ఈడ్చుకెళ్లి వాహనాల్లో కుక్కివేశారు. మహిళా రైతులను శిబిరం నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా ఆక్వాఫుడ్‌పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగర్వు గ్రామాల రైతులు బుధవారం చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. ధర్నాచౌక్‌నుంచి రోడ్డుపైకి వస్తే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరించారు. ఆ సమయంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అసెంబ్లీకి వెళతామంటూ శిబిరం నుంచి బయల్దేరిన రైతులను పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళన కారులకు మధ్య జరిగిన తోపులాటలో మహిళలకు గాయాలయ్యాయి. -
తుందుర్రులో మళ్లీ ఉద్రక్తత..
సాక్షి, భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తుందుర్రు ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ రేపు ఛలో అమరావతికి పిలుపు నిచ్చింది. దీంతో ఆ గ్రామంలో పెద్ద పెత్తున పోలీసులను మోహరించారు. పోరాట కమిటీ నాయకులు ఆరుగురిని పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. పచ్చటి పొలాలతో కళకళలాడే తుందుర్రు ప్రాంతం రణరంగంగా మారిన విషయం తెలిసిందే. ఆక్వాఫుడ్ పార్క్ వద్దంటూ 33 గ్రామాల ప్రజలు పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే. -
బిగుసుకుంటున్న ఉద్యమ పిడికిళ్లు
భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని తుందుర్రు, జొన్నలగరువు, కంసాలబేతపూడి గ్రామాల మధ్యలో నిర్మిస్తున్న గోదావరి ఆక్వాఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమ పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. ఇటీవల పది రోజులకు పైగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కాని ప్రభుత్వం, ఫ్యాక్టరీ యజమానుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో సెప్టెంబర్ 20న ఫుడ్‌పార్కు బాధిత గ్రామాలైన తుందుర్రు, జొన్నలగరువు, కంసాల బేతపూడి గ్రామాల ప్రజలు, పోరాట కమిటీ నాయకులు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కొంతమంది పోరాట కమిటీ నాయకులు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డగించి బయటకు పంపివేశారు. ఎక్కడిక్కడ రహస్య మంతనాలు మూడేళ్లుగా ఫుడ్‌పార్కు వద్దని ఫుడ్‌పార్కు పోరాట కమిటీ నాయకులు, గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమాల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం, యాజమాన్యం మొండిగా ముందుకెళ్తున్నాయి. అంతేకాకుండా ఎదురు తిరిగిన వారిపై వివిధ సెక్షన్లతో కేసులు పెట్టి పోలీసులు కఠినంగా వ్యవహరించారు. వందలాది మంది గ్రామస్తులు పోలీసుల చేతిలో దెబ్బలు తిని, అరెస్టు అయ్యి బయటకు వచ్చారు. ముందుగానే సమాచారం ఇస్తే భారీగా పోలీసులను మోహరిస్తున్నారని తెలుసుకుని ఫుడ్‌పార్కు బాధిత గ్రామాల్లో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పోలీసు బలగాల రక్షణతో.. విషం చల్లే గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కు వద్దని మూడేళ్ల నుంచి ప్రజలు పోరాటం చేస్తున్నారు. అయితే 144 సెక్షన్ విధించి వందలాది మంది పోలీసుల పహారాలో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఫ్యాక్టరీ వల్ల నష్టాలు ఇక్కడ నిర్మించే గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కులో రోజుకు మూడు వేల టన్నుల చేపలు, రొయ్యలు శుభ్రపరుస్తారు. వీటిని శుభ్రపరిచేందుకు వందలాది టన్నుల అమ్మోనియా, నైట్రేట్, ఉప్పును వాడతారు. ఆ నీటిని పక్కనే ఉన్న గొంతేరు డ్రెయిన్‌లోకి విడుదల చేయడంతో మూడు పంటలు పండే భూములు ఉప్పుకయ్యలుగా మారతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా మత్స్య సంపద దెబ్బతింటుందని 40 వేల మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని చెబుతున్నారు. ఆరు మండలాల ప్రజలపై ఈ ఫ్యాక్టరీ ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేకులు విడుదల
-
తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత
-
తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): భీమవరం మండలం తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత ఏర్పడింది. ఆక్వాఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా మహిళలు రాస్తారోకోకు దిగారు. గురువారం అర్దరాత్రి సమయంలో ఫ్యాక్టరీ యాజమాన్యం పనులు తిరిగి ప్రారంబించేందుకు సన్నాహాలు చేయడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీలోపలికి వెళ్లేందుకు వచ్చిన లారీలను అడ్డుకుని కిరోసిన్ డబ్బాలతో రోడ్ పై బైఠాయించి నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణం వద్దంటూ నినాదాలు చేశారు. గ్రామస్దుల ఆందోళనలతో ఎట్టకేలకు లారీలు వెనుదిరిగాయి. లారీలు వెనుదిరగడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. -
తుందుర్రులో ఉద్రిక్తత
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో ఉద్రిక్తత ఏర్పడింది. ఆక్వాఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో పాల్గొన్నవారిని పోలీసులు నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగిస్తున్నారు. -
తుందుర్రులో ఉద్రిక్తత
భీమవరం: పశ్చిమగోదావరిజిల్లా భీమవరం మండలంలోని తుందుర్రులో ఉద్రిక్తత నెలకొంది. ఆక్వా ఫుడ్ పార్క్‌ను ముట్టడిస్తామని సీపీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ 144వ సెక్షన్ విధించి పోలీసులను భారీగా మోహరించారు. గ్రామానికి చెందిన ముగ్గురు నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. తుందుర్రుతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు అణువణువూ గాలిస్తున్నారు. -
తుందుర్రులో ఉద్రిక్తత
-
ఖాకీ గుప్పెట్లో తుందుర్రు
ఆంక్షల వలయంలో ఆక్వాపార్క్ బాధిత గ్రామాలు భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా ఫుడ్‌పార్క్ బాధిత గ్రామాల్లో ప్రజలు ఇంకా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పోలీసు ఆంక్షలు కొనసాగుతుండటంతో బయటకు రావడానికి జనం జంకుతున్నారు. బుధవారం నాటి ఘటనలతో భీతిల్లిపోయిన మహిళలు, వృద్ధులు, పిల్లలు గురువారం కూడా ఆ భయాందోళన నుంచి బయటకు రాలేదు. తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు తదితర గ్రామాల్లోకి బయటి వ్యక్తులను పోలీసులు అనుమతించలేదు. అప్రకటిత కర్ఫ్యూ కొనసాగింది. దీంతో విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లడా నికి భయపడ్డారు. బుధవారం ఆక్వా ఫుడ్‌పా ర్క్ బాధిత గ్రామాల్లో భీతావహ పరిస్థితిని సృష్టించిన పోలీసులు.. మహిళలు, బాలింత లు, వృద్ధులని చూడకుండా నిర్దాక్షిణ్యంగా దొరికినవారిని దొరికినట్టు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రోజంతా తిండీ తిప్పలు లేక చంటి పిల్లలు, చిన్నారులు అలమటిం చారు. అరెస్టయిన వారందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై అర్ధరాత్రి వదిలిపెట్టారు. ఆ సమయాన ఇల్లు చేరుకున్న తల్లులు పిల్లలను అక్కున చేర్చుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పటికప్పుడు వంట చేసి పిల్లలకు నాలుగు మెతుకులు తినిపించారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం ప్రభుత్వం తమపై పోలీసులను ప్రయోగించడం పట్ల గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసులు తమ పట్ల ఇంత రాక్షసంగా వ్యవహరించడం తగదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టిç ³రిస్థితు ల్లోనూ ఆక్వా ఫుడ్ పార్క్ కట్టనీయబోమని, ప్రాణాలు పోయినా.. ఎన్నిసార్లు పోలీసులను ప్రయోగించినా తమ వైఖరి మారదని మహిళలంతా మూకుమ్మడిగా తేల్చి చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తామేంటో నిరూపిస్తామని శపథం చేస్తున్నారు. -
తుందుర్రులో కదం తొక్కిన ప్రజలు
ఆక్వా పార్క్ ఏర్పాటుపై వ్యతిరేకత 200 మంది ఆందోళనకారుల అరెస్ట్ పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ నర్సాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, భీమవరం మండలాల మధ్య గల తుందుర్రులో మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి నిషేధాజ్ఞలు జారీ చేశారు. వాటిని ధిక్కరించి ధర్నాలో పాల్గొన్న సుమారు 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ పార్కు నిర్మాణం చేపట్టొద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మహిళా పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి నర్సాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం, నాయకులు త్రిమూర్తులు, పెద్దిరాజు, పూర్ణ, పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పరిసర గ్రామాల్లో 144 సెక్షన్.. ప్రజల ఆందోళనతో తుందుర్రులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చిన సుమారు 1,300 మంది పోలీసు సిబ్బందితో గ్రామం నిండిపోయింది. ప్రధాన రహదారులపై బారీకేడ్లు, తనిఖీలతో పోలీసులు ఉదయం నుంచి ఎవరినీ బయటి గ్రామాల నుంచి రాకుండా నియంత్రించారు. పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. పెద్దఎత్తున పోలీసు బలగాల పహారా ఉండగానే సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్థులు, మహిళలు పార్క్ నిర్మాణం ఏర్పాటుపై తమ వ్యతిరేకతను నిర్భయంగా వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని నర్సాపురం రూరల్ పోలీస్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన ఉద్యమకారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం పార్క్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. కె.బేతపూడి, జొన్నలగరువు, తుందుర్రు గ్రామాల్లో అడుగడుగున పోలీసులు మోహరించారు. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా దర్శనిమిస్తున్నాయి. భీమవరం, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్భందం చేశారు. ప్రతి గ్రామంలోనూ పోలీసులు భారీగా మోహరించారు. ఎవరినీ బయటకు రానివ్వలేదు. -
తుందుర్రు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్
-
చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు: బుగ్గన
విజయవాడ: ఆక్వా ఫుడ్ పార్కు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ప్రజల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బాధిత ప్రాంతాలపై ప్రభుత్వ వైఖరి సరికాదని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ లెక్కలన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయని బుగ్గన విమర్శించారు. వాస్తవాలను చెబుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని బుగ్గన వ్యాఖ్యానించారు. అందుకే ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తున్నారని ఆయన అన్నారు. రైతులు పెట్టిన భోజనం తినలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తినే ప్రతి ముద్దను రైతును తలుచుకుని తినే సంస్కారం వైఎస్ రాజశేఖరరెడ్డి నేర్పారన్నారు. యనమల రామకృష్ణుడు లాంటి ఆర్థిక మంత్రిని ఎక్కడా చూడలేదని, ఆయన చూపిన లెక్కలకు...వాస్తవాలకు పొంతన లేదన్నారు. యనమల అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారని బుగ్గన మండిపడ్డారు. అలాగే సొంత డబ్బా కొట్టుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటు అయిపోయిందని బుగ్గన ఎద్దేవా చేశారు. సత్యానాదేళ్లను తానే మైక్రోసాఫ్ట్ రంగాన్ని ఎంచుకోమన్నానని, ఇక పీవీ సింధు కూడా తనవల్లే ఒలింపిక్స్ లో పతకం సాధించిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. -
చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారు
-
అట్టుడుకుతున్న గోదావరి పల్లెలు
పశ్చిమగోదావరి జిల్లా అట్టుడుకుతోంది. ఆక్వా ఫుడ్‌పార్కు పెడితే దాన్నుంచి వెల్లువెత్తే కాలుష్యం కారణంగా తమ జీవనం మొత్తం అస్తవ్యస్తం అవుతుందని గగ్గోలు పెడుతున్న తుందుర్రు పరిసర గ్రామాల వాసులను పోలీసులు ఈడ్చిపారేశారు. ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహిళలను మహిళా దినోత్సవం అని కూడా చూసుకోకుండా లాఠీలతో కుమ్మేశారు. గర్భిణులను కూడా ఎత్తుకెళ్లి జీపుల్లో వేసి స్టేషన్లకు తీసుకెళ్లారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ప్రయత్నించిన నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారు. పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రజల మనోభావాలను గుర్తించరా? ప్రజల మనోభావాలను గుర్తించకుండా.. తీరప్రాంత ప్రజలను దారుణంగా నిర్బంధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకుడు ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. నిర్బంధాల ద్వారా ప్రజావ్యతిరేకతను ప్రభుత్వం ఆపలేదని ఆయన అన్నారు. ఈ ఫ్యాక్టరీ కడితే నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుందని, మత్స్యకారుల జీవన విధానం దెబ్బతింటుందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వచ్చి తుందుర్రు పరిసర ప్రాంత వాసులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ఫ్యాక్టరీలకు తాము వ్యతిరేకం కాదని, సముద్రతీర ప్రాంతానికి ఇదే నియోజకవర్గంలో కట్టాలని తామంతా కూడా కోరామని.. దాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పామని అన్నారు. కానీ ప్రభుత్వం మొండివైఖరితో ఆరు నెలల నుంచి ఈ గ్రామాల్లో పోలీసులను మోహరిస్తున్నారని, 144 సెక్షన్ పెట్టి ప్రజలను నిర్బంధిస్తున్నారని తెలిపారు. ఈ ఫ్యాక్టరీని ఇదే నియోజకవర్గంలో ఎవరికీ నష్టంలేని చోట తీరప్రాంతంలో కడితే, ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడివారికే వస్తాయని తెలిపారు. రాష్ట్రమంతా రౌడీరాజ్యం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రమంతటినీ రౌడీ రాజ్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకుడు గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. ఇక్కడ దాదాపు 2వేల మంది పోలీసులను పెట్టారని, తమ సొంత ఊళ్లలో తిరగాలన్నా కూడా ఆధార్ కార్డులు పట్టుకుని తిరగాల్సి వస్తోందని అన్నారు. అసలు తొలుత పబ్లిక్ హియరింగ్ జరిపించి, ప్రజల అనుమతితోనే ఫ్యాక్టరీ కడతామని అందరూ చెప్పారని, కానీ అసలు పబ్లిక్ హియరింగ్ అన్నదే చేయలేదని తెలిపారు. పోలీసులు మఫ్టీలో ఉండి ప్రజల్లో కలిసిపోయి దారుణాలు చేస్తున్నారని, మహిళలను కూడా అరెస్టు చేసి ఈడ్చేస్తున్నారని వాపోయారు. చంద్రబాబు నేతృత్వంలో ఇక్కడ రాక్షస పాలన కొనసాగుతోందని, ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యానికి వంతపాడుతోందని మండిపడ్డారు. పోలీసులను అడుగుదామని అనుకుంటే తమను పొద్దుట నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వేయనీయకుండా హౌస్ అరెస్టు చేశారన్నారు. తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏం చెప్పాలని ఆయన అన్నారు. -
తుందుర్రు పరిసరాల్లో టెన్షన్ టెన్షన్
-
తుందుర్రు పరిసరాల్లో టెన్షన్ టెన్షన్
తుందుర్రు (పశ్చిమగోదావరి జిల్లా): ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు, పరిసర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్వాఫుడ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ 30 గ్రామాల ప్రజలు బుధవారం ఆందోళన బాటపట్టారు. అక్వాఫుడ్ పార్క్ నిర్మాణం జరిగితే ఫ్యాక్టరీ నుంచి విష రసాయనాలు వచ్చి పంట కాలువలు, పంట పొలాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ పార్కు నిర్మాణం చేపట్టొద్దని పెద్దఎత్తున నినాదాలు చేశారు. తుందుర్రు గ్రామం పోలీస్ పహారాలో ఉంది. 1100 మంది పోలీసులతో భారీ భద్రతను చేపట్టారు. 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమానికి ప్రజాసంఘాలు, వైఎస్సార్సీపీ, సీపీఎం మద్దతు తెలిపాయి. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. వందలాది మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మహిళా పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి నర్సాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం, నాయకులు త్రిమూర్తులు, పెద్దిరాజు, పూర్ణ, పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కె.బేతపూడి, జొన్నలగరువు, తుందుర్రు గ్రామాల్లో అడుగడుగునా పోలీసులను మోహరించారు. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడే పరిసస్థితి నెలకొంది. దీంతో గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. భీమవరం, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్భందం చేశారు. ప్రతి గ్రామంలోనూ పోలీసులు భారీగా మోహరించారు. ఎవరినీ బయటకు రానివ్వలేదు. -
ఇటుక పేర్చినా యుద్ధమే
నరసాపురం :‘గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ పేరుతో మా ఇళ్లమధ్య కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీ కడుతున్నారు. మా పంటలు పాడైపోతాయి. మా ఆరోగ్యాలు గాలిలో కలిసిపోతాయి. భూములు బీడువారి రైతులు బికారులవుతారు. మత్స్యకారులు, కూలీలు ఉపాధి కోల్పోయి ఊళ్లొదిలి పోవాల్సి వస్తుంది. ఆక్వా పార్క్ ఇక్కడ కట్టొద్దని రెండేళ్లుగా పోరాటం చేస్తున్నాం. మా వేదనపై పోలీస్ జులుం ప్రదర్శించారు. హత్యానేరాలు మోపి జైళ్లలో పెట్టించారు. ఇంతాచేసి మాకు నచ్చజెప్పడానికి ఇప్పుడు ఎమ్మెల్యేలు వస్తారా. ధైర్యముంటే పోలీస్ బందోబస్తు లేకుండా రండి. చెప్పులు, చీపుర్లతో సమాధానం చెబుతాం’ అని ఆక్వాపార్క్ ప్రభావిత గ్రామాల ప్రజలు హెచ్చరించారు. ‘ఇకముందు ఫ్యాక్టరీ నిర్మాణంలో ఇటుక పేర్చినా యుద్ధమే. ప్రజలు కావాలో.. ఇద్దరు పారిశ్రామిక వేత్తలు కావాలో చంద్రబాబు తేల్చుకోవాలని అఖిల పక్షం నాయకులు చంద్రబాబుకు సవాల్ విసిరారు. తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భీమవరం, నరసాపురం, వీరవాసరం, మొగల్తూరు మండలాలకు చెందిన వేలాది మహిళలు శుక్రవారం నరసాపురం తరలివచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటాన్ని కొనసాగిస్తామని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ, వామపక్ష, ఇతర పార్టీల నాయకులు మద్దతు పలికారు. బాధితులకు అండగా నిలుస్తామని, పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళతామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాదిమంది నినాదాలు చేయ డంతో చేయడంతో సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంతం దద్దరిల్లింది. ఫ్యాక్టరీ తరలిస్తే శ్రమదానం చేస్తాం : ఆళ్ల నాని మహాధర్నా సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. ఆక్వా పార్క్ కాలుష్యాన్ని సముద్రంలోకి తరలించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి పైప్‌లై¯ŒS వేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ‘ఫ్యాక్టరీ నీదా.. నీ అనుయాయులదా.. లేక భారీగా వాటాలున్నాయా. ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీకి ప్రభుత్వ సొమ్ముతో పైప్‌లై¯ŒS వేయాలనే ఉత్సాహం ఎందుకని ప్రశ్నిం చారు. పరిశ్రమల ఏర్పాటుకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదని, పరిశ్రమలు రావాలని, అభివృద్ధి జరగాలన్నదే తమ అభిమతమని నాని చెప్పారు. అయితే, ప్రజల కడుపుపై కొట్టి అదే అభివృద్ధి అంటే ఊరుకునే పరిస్థితి లేదన్నారు. ఇదే ఫ్యాక్టరీని సముద్రతీరానికి తరలిస్తే తామూ శ్రమదానం చేస్తామని చెప్పారు. ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, గ్రామాల్లో 144 సెక్ష¯ŒS ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. తుందుర్రు ఆక్వాపార్క్ విషయంలో తమ పార్టీ అధినేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఒకే నిర్ణయంతో ఉన్నారన్నారు. తుందుర్రు రావద్దని ఆయనపై ఎన్నో ఒత్తిళ్లు తెచ్చారని, ఇక్కడ ఏ సమస్యా లేదని చెప్పారని అన్నారు. తనకు పార్టీ ప్రయోజనాలతో పనిలేదని, జనం అభిప్రాయమే ముఖ్యమని భావించి వైఎస్ జగ¯ŒS తుందుర్రు పర్యటనకు వచ్చారని వివరించారు. ఆక్వాపార్క్‌ను ఇక్కడి నుంచి తరలించేవరకు వైఎస్సార్ సీపీ నిద్రపోదన్నారు. నరసాపురం, భీమవరం ఎమ్మెల్యేలు ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడాలని, లేదంటే చంద్రబాబుతోపాటు వాళ్లూ బంగాళాఖాతంలో కలుస్తారని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఆక్వా పార్క్ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తే సహించేది లేదన్నారు. అన్ని స్థానాలనూ కట్టబెట్టిన జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు రుణం తీర్చుకుంటానంటూ కక్షగట్టి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తుం దుర్రు ఫ్యాక్టరీ కారణంగా గొంతేరు కాలుష్యం అవుతుందన్నారు. వేలాదిమంది మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని, పంట భూములు బీడుగా మారి రైతులు బికారులుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తాము గడపగడపకూ తిరుగుతున్నామని, దాదాపు ప్రతి గడపలోనూ చంద్రబాబు రాక్షస పాలనతో కన్నీరే కనిపిస్తోందని చెప్పారు. 40 గ్రామాల వారు ఫ్యాక్టరీ వద్దు బాబోయ్ అని ముక్తకంఠంతో చెబుతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ మోసపూరిత కబుర్లు చెప్పడం, పరిశ్రమల పేరుతో దోచుకోవడమే పరమావధిగా ముఖ్యమంత్రి ముందుకెళుతున్నారని విమర్శించారు. పరిశ్రమల వ్యతిరేకివి నువ్వే : ఉమామహేశ్వరరావు పరిశ్రమల పేరుతో సాగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే సీపీఎం వాళ్లు టెర్రరిస్టులు.. వైఎస్సార్ సీపీ వాళ్లు పరిశ్రమలకు అడ్డుతగులుతున్నారంటూ చంద్రబాబు నోరు పారేసుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మూతపడ్డ 15వేల పరిశ్రమలను తెరి పించడంలో ముఖ్యమంత్రి ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. వాటిని తెరిపిస్తే కమీషన్లు పెద్దగా రావని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో పారిశ్రామిక వేత్తలతో సమావేశం పెట్టి రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారని, ఎన్ని కోట్లు పెట్టుబడులు వచ్చాయని నిలదీశారు. పరిశ్రమల ఏర్పాటుకు తామెవరూ వ్యతిరేకం కాదని, చంద్రబాబే వ్యతిరేకి అని పేర్కొన్నారు. ‘ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, అంజిబాబు, మాధవనాయుడు చంద్రబాబు ఆదేశాలతో మీ వద్దకు వచ్చి ఫ్యాక్టరీ కట్టాలని నచ్చజెబుతారంట. మరి మీరేం చేస్తారు’ అని ప్రజలను ప్రశ్నించారు. మహిళలు చేతులు పైకెత్తి చెప్పులు, చీపుర్లతో సమాధానం చెబుతామన్నారు. మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ భీమవరం ఎమ్మెల్యే అర్ధరాత్రి వేళ తుందుర్రు గ్రామానికి రావాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. జనసేన జిల్లా నాయకుడు సాగర్‌బాబు మాట్లాడుతూ ఫ్యాక్టరీని వేరే ప్రాంతానికి తరలించాలని పవ¯ŒSకల్యాణ్ బుద్ధుడుగా సూచన చేశారని, తరలించకపోతే ఆయన రుద్రుడుగా మారతారని హెచ్చరించారు. పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, ఆరేటి సత్యవతి, ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ తాము ఎంతకాలమైనా జైలు జీవితం గడపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే ఆర్.సత్యనారాయణరాజు, సీపీఐ నాయకుడు నెక్కంటి సుబ్బారావు, మునిసిపల్ ఫ్లోర్‌లీడర్ సాయినా«థ్ ప్రసాద్, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ మాట్లాడారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, ప్రచార కమిటీ కన్వీనర్ ఎల్.సుధీర్‌బాబు, అధికార ప్రతినధి ఎం.జయప్రకాశ్, సీపీఎం నేతలు జేఎ¯ŒSవీ గోపాలన్, కవురు పెద్దిరాజు, ఐద్వా జిల్లా కార్యదర్శి కమల తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు టెరరిస్టులనడం దారుణం
-
ఆగని మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిరసనలు
-
ప్రజాసంక్షేమం పట్టని సీఎం
భీమవరం : దోచుకో.. దాచుకో అనే సూత్రానికి తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజాసంక్షేమం పట్టడం లేదని, ఎవరి మాటలూ తలకెక్కవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా సోమవారం భీమవరంలో ప్రారంభమైన ప్రజాభేరి పాదయాత్రనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఫుడ్‌పార్క్ కారణంగా భీమవరం, నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం మండలాల్లోని సుమారు 40 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. రైతులు, మత్స్యకారులు ఉపాధిని దెబ్బతీసే ఫుడ్‌పార్క్‌ను జనావాసాల నుంచి సముద్రతీరప్రాంతానికి తరలించాలని రెండున్నరేళ్లుగా ఆందోళన చేస్తున్న సీఎంకు పట్టడం లేదన్నారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఏవైనా సూచనలు చేస్తే అభివృద్ధి నిరోధకుడని ముద్ర వేస్తున్నారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పినా ముఖ్యమంత్రి పెడచెవినపెట్టారని దుయ్యబట్టారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కును మరోచోటకు తరలించాలని తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు రెండున్నరేళ్లుగా ఉద్యమిస్తుంటే ఆయా గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టి పోలీసులను మోహరింప చేసి ప్రజలను జైల్లో పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు ధనవంతుల కోసం 40 గ్రామాల ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని అడ్డుకుంటామన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరి కోసం మాట మార్చారో చెప్పాలని నిలదీశారు. ఇక్కడి ప్రజలది న్యాయసమ్మతమైన కోరిక కాబట్టే ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి స్వయంగా ఇక్కడ పర్యటించి ఉద్యమానికి అండగా ఉంటామని మాట ఇచ్చిన విషయం గుర్తించాలన్నారు. అనంతరం ప్రజాభేరి పాదయాత్ర ప్రకాశం చౌక్ నుంచి రెస్ట్‌హౌస్ రోడ్డు, బ్యాంక్ కాలని, గునుపూడి మీదుగా తాడేరు, కరుకువాడ చేరుకుంది. సీపీఎం నాయకులు బి.బలరామ్, జేఎన్వీ గోపాలన్, జుత్తిగ నర్సింహమూర్తి, వైఎస్సార్ సీపీ నాయకుడు భూసారపు సాయి సత్యనారాయణ, సీపీఐ నాయకుడు ఎం.సీతారాం ప్రసాద్, తుందుర్రు ఎంపీటీసీ జవ్వాది వెంకట రమణ పాల్గొన్నారు. -
ఇచ్చిన హామీలకన్నా ఎక్కువే చేశా
- కొందరు కోర్టులకెళ్తూ నాకున్న మంచిపేరును చెడగొడుతున్నారు - ప్రతి పనినీ అడ్డుకుంటున్నారు - వీళ్లకు, టైస్టులకు పెద్ద తేడా ఏముంది? - కాకినాడ సభలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘ఎన్నికల్లో ఏమైతే చెప్పానో అవన్నీ పూర్తి చేశాను. అప్పుడు చెప్పిన దానికంటే ఇంకాస్త ఎక్కువే చేశాను. నాకు మంచిపేరు వస్తుందంటే చాలు.. కొందరు కోర్టులకు, ట్రిబ్యునళ్లకు పోరుు ఆ పేరు చెడగొడుతున్నారు. వీళ్లకు, టెరర్రిస్టులకు పెద్ద తేడా ఏముంది?’’ అంటూ సీఎం చంద్రబాబు విపక్షాలపై ధ్వజమెత్తారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ‘దోమలపై దండయాత్ర ర్యాలీ’ని ప్రారంభించాక ఆనందభారతి గ్రౌండ్సలో ఏర్పాటుచేసిన ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ సభలో సీఎం మాట్లాడారు. విభజన తరువాత ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, అభివృద్ధి కావాలన్నా అనుభవమున్న తనవల్లే జరుగుతుందనే.. ప్రజలు తనకు పట్టం కట్టారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాననన్నారు. ‘రెండు పంటలకూ నీరిచ్చి ఎకరం కూడా ఎండిపోకుండా చూశా. రైతుల్ని రూ..24 వేల కోట్ల మేరకు రుణవిముక్తి చేశా. డ్వాక్రా సంఘాల్లోని 84 లక్షలమందికి రూ.10వేలు వంతున అందజేశా. తెలుగుదేశం కాక మరే ప్రభుత్వం ఇలా చేసిందో చెప్పాలి’ అని సవాలు విసిరారు. త్వరలో మహిళాసంఘాల్లోని ప్రతి సభ్యురాలికీ రూ.3వేలు వంతున ఖాతాల్లో వేస్తామన్నారు. స్వచ్ఛమైన, నీతివంతమైన పాలన అందిస్తున్నానన్నారు. కొందరు రాజకీయాల ముసుగులో ప్రతి పనినీ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఆక్వా ఫుడ్ పార్క్, రాజధాని, పట్టిసీమ, భోగాపురం ఇలా ప్రతిదాన్నీ వ్యతిరేకిస్తున్నారన్నారు. అరుునా తాను లెక్కచేయనని, అనుకున్న పనిని చేసుకుంటూ ముందుకుపోతానన్నారు.కాపులకు సామాజిక న్యాయం చేద్దామనే ప్రయత్నంలో ఉన్నానని చెప్పారు. వారితోపాటు బీసీలకూ న్యాయం చేస్తానన్నారు. విద్యార్థి ప్రసంగం.. హెచ్ఎంపై ఆగ్రహం బహిరంగసభలో ఓ విద్యార్థిని పిలిచి మాట్లాడాలని సీఎం కోరడంతో వేదికపెకైక్కిన కాకినాడ రూరల్ పగడాలపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి లక్ష్మీపతివర్మ.. స్కూల్ పరిసరాల్లో మందుబాబుల ఆగడాలు, అపరిశుభ్రత, తదితర ఇబ్బందుల గురించి చెప్పడంతో సీఎం మైక్ అందుకుని.. హెచ్.ఎం గోపాలకృష్ణను ‘నువ్వేం చేస్తున్నా’వంటూ ప్రశ్నించారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని కూడా ‘ఏవమ్మా నువ్వు సపోర్టు చేస్తున్నావా?’ అని నిలదీశారు. మద్యం సేవించడం వంటి ఘటనలను నియంత్రించాలని, అలాంటివారిపై పీడీయాక్టు కింద కేసు పెట్టాలని పోలీసుల్ని ఆదేశించారు. -
తుందుర్రు కన్నెర్ర
ప్రజల ఆకాంక్షలను అణచివేస్తూ.. పాశవిక చర్యలతో జన సంక్షేమాన్ని బలిపీఠం ఎక్కించిన సర్కారు తీరుపై తుందుర్రు ప్రజలు కన్నెర్రచేశారు. రెండున్నరేళ్లుగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తున్న వారు తమ ఆవేదనను వెళ్లగక్కారు. తమకు బాసటగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. కాలుష్య కోరలు చాచిన విష రక్కసి ఫుడ్‌పార్క్ అని, దీనిని సాగర తీరానికి తరలించాలని, లేకుంటే సర్కారునే బంగాళాఖాతంలో కలిపేస్తామని వై.ఎస్.జగన్ అల్టిమేటం ఇచ్చారు. తమ పక్షాన నిలిచిన జననేతకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. నన్నెందుకు అరెస్ట్ చేశారో తెలీదు తణుకు : ‘మా గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నా పెద్ద కొడుకుగా మీకు తెలియజేయాలనుకున్నా. ఈ పరిస్థితుల్లో నా దగ్గరకు మీరే వస్తారని అనుకోలేదు. నన్ను ఎందుకు అరెస్టు చేశారో తెలీదు. కాలుష్యకారకంగా మారుతుందని గోదావరి మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నామనే నెపంతో నన్ను, నా కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. నా కొడుకును నరసాపురం సబ్‌జైలులో ఉంచితే.. నన్ను తణుకు సబ్‌జైలులో పెట్టారు. 36 రోజులుగా జైలులోనే ఉన్నా. నాభర్తకు క్యాన్సర్. ఇంటి వద్ద ఆయనకు కనీసం అన్నం పెట్టే దిక్కులేదు.’ అంటూ తుందుర్రు ఆక్వాఫుడ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అక్రమంగా అరెస్టయి తణుకు సబ్‌జైలులో ఉన్న ఆరేటి సత్యవతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం తణుకు సబ్‌జైలులో సత్యవతిని జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. కొద్దిసేపు ఆమెతో మాట్లాడారు. ఆమె తన గోడును జననేత వద్ద వెళ్లబోసుకున్నారు. తమ గ్రామంలో ఎవ్వరినీ రోడ్లపై తిరగనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, 144 సెక్షన్ విధించారని సత్యవతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటలు పండక ఇబ్బందులు పడుతున్నామని, ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల కాలుష్యం ఎక్కువవుతుందని పేర్కొన్నారు. తాము రెండున్నరేళ్లుగా ఆందోళన చేస్తున్నా.. సర్కారు పట్టించుకోవడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తక్షణమే ఫుడ్‌పార్క్‌ను ఇక్కడి నుంచి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆమె జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీంతో చలించిన జగన్మోహన్రెడ్డి తుందుర్రు ఆక్వా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా పోరాడతామని భరోసా ఇచ్చారు. పార్క్ బాధిత గ్రామాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తక్షణమే ఫుడ్‌పార్క్‌ను సముద్ర తీరానికి తరలించేలా ప్రభుత్వంపైనా, యాజమాన్యంపైనా ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డి వెంట ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ మంత్రి కె.పార్థసారథి, కేంద్ర పాలక మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్లు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, తానేటి వనిత, సీఈసీ సభ్యులు చీర్ల రాధయ్య, చిర్ల జగ్గిరెడ్డి తదితరులు ఉన్నారు. నా తల్లిని అన్యాయంగా జైల్లో పెట్టారు జగన్‌ను కలిసిన సత్యవతి కుమార్తె కళ్యాణి తణుకు : కాలుష్యం వెదజల్లే కర్మాగారాన్ని వ్యతిరేకించినందుకే తన తల్లి ఆరేటి సత్యవతిపై హత్యాయత్నం కేసు మోపి జైల్లో పెట్టించారని ఆమె కుమార్తె ఆరేటి కళ్యాణి ఆరోపించారు. సత్యవతిని పరామర్శించేందుకు బుధవారం తణుకు సబ్‌జైలుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు ఆమె ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా జగన్‌తోపాటు సబ్‌జైలులో ఉన్న తన తల్లిని పరామర్శించేందుకు వెళ్లారు. అనంతరం కళ్యాణి విలేకరులతో మాట్లాడుతూ ఒక పక్క నాన్నకు క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, తన సోదరులు, తల్లిని జైల్లో నిర్భంధించి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. 36 రోజులుగా వారు జైల్లోనే మగ్గుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను కూడా కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే ఆశలు చిగురించాయని ఆమె పేర్కొన్నారు. -
నేడు తుందుర్రుకు వైఎస్ జగన్
⇒ మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులతో ముఖాముఖి ⇒ తణుకు సబ్‌జైలులో ఉద్యమకారిణి సత్యవతికి పరామర్శ సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలను కలుసుకుని వారితో ముఖాముఖీ మాట్లాడతారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు తెలిపిన ప్రకారం జగన్ పర్యటన వివరాలిలా ఉన్నాయి.. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా తణుకు పట్టణానికి వెళతారు. 36 రోజులుగా అక్కడి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న తుందుర్రు గ్రామస్తురాలు, ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమకారిణి ఆరేటి సత్యవతిని పరామర్శిస్తారు. అక్కడినుంచి అత్తిలి, పాలకోడేరు, భీమవరం మీదుగా తుందుర్రు గ్రామానికి చేరుకుంటారు. ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారిని కలుసుకుని ముఖాముఖీ మాట్లాడతారు. -
నేడు తుందుర్రుకు వైఎస్ జగన్
-
ఆక్వాఫుడ్ వ్యవహారంపై చంద్రబాబు సమీక్ష
అమరావతి: గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణానికి బాధిత గ్రామాల ప్రజల నుంచి వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో గోదావరి ఆక్వాఫుడ్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, అధికారులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో జిల్లా మంత్రులైన మాణిక్యాలరావు, పీతల సుజాత పాల్గొనలేదని తెలిసింది. సీఎం చంద్రబాబు అధికారులతో మాత్రమే సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్టు సమాచారం. -
అక్రమ కేసులకు చంద్రబాబుదే బాధ్యత
తణుకు అర్బన్ : ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలోకి నెట్టడం, తుందుర్రు, పరిసర గ్రామాల ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడటం వంటి దురాగతాలకు చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందాకరత్ పేర్కొన్నారు. తణుకు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తుందుర్రు ఆక్వా పార్క్ బాధితురాలు ఆరేటి సత్యవతిని బృందాకరత్ గురువారం పరామర్శించారు. అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడుతూ ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పెట్టుబడిదారుల పక్షాన నిలబడి అమాయకులపై హత్యానేరం కేసులు మోపి జైళ్లలో పెట్టడం దారుణమన్నారు. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల ప్రజలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా.. వారిని భయభ్రాంతులకు గురిచేసేలా పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్న తీరు బా«ధాకరమన్నారు. ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల నీరు, గాలి కలుషితమవుతాయనే భయంతో ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. వారి అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా తుందుర్రు పరిసర గ్రామాలను పోలీసు చట్రంలో నిర్బంధించి పరిశ్రమ నిర్మిస్తున్న తీరు ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. తక్షణమే నిర్మాణాలను నిలుపుదల చేయాలని, లేకుంటే ఈ సమస్యను జాతీయ స్థాయికి తీసుకువెళ్తానని హెచ్చరించారు. ఆమె వెంట ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.స్వరూపారాణి, కార్యదర్శి రమాదేవి, తణుకు డివిజన్ సీపీఎం కార్యదర్శి పీవీ ప్రతాప్, ఆల్ ఇండియా లాయర్స్ యూని యన్ జిల్లా కమిటీ సభ్యుడు కామన మునిస్వామి, ఐద్వా తణుకు డివిజన్ కార్యదర్శి కె.నాగరత్నం, నాయకులు గార రంగారావు, బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు పొట్ల సురేష్, జేఎస్పీ నాయకుడు అనుకుల రమేష్, ఎల్ఐసీ ఏజెంట్ల యూనియన్ నాయకుడు పీఎల్ నరసింహరావు ఉన్నారు. -
చంద్రబాబుకు కన్నీళ్లు రప్పించండి
భీమవరం :‘మీరెవరూ అధైర్య పడకండి. పోలీస్ దౌర్జన్యాలను.. సర్కారు గూండాగిరికి భయపడి కన్నీరు పెట్టకండి. ఇదే ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వంపై పోరాడండి. చంద్రబాబుకు కన్నీళ్లు రప్పించండి’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందాకరత్ ఆక్వా ఫుడ్‌పార్క్ బాధిత గ్రామాల ప్రజలకు పిలుపునిచ్చారు. తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భీమవరం పాత బస్టాండ్‌లో గురువారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల సహజ వనరులు పూర్తిగా దెబ్బతింటాయని, తాగు, సాగునీటి వనరులు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తుందుర్రు సమీపంలోని సుమారు 40 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. ఆక్వా పార్క్ నిర్మాణం కారణంగా ఆ ప్రాంత ప్రజల్లో ఆనందం కరువై జీవచ్ఛవాల్లా గడపాల్సి వస్తోందన్నారు. వేలాది మంది వ్యతిరేకిస్తున్నా ఫుడ్‌పార్క్ నిర్మాణం కోసం పోలీసులను ఉపయోగించి ప్రజలపై దౌర్జన్యాలు చేయడం సరికాదని ఆమె దుయ్యబట్టారు. ప్రజల అంగీకారం లేకుండా పార్క్ ఎలా నిర్వహించగలరని ప్రశ్నిం చారు. ఆక్వా పార్క్ అవసరాలకు ప్రతిరోజు లక్ష లీటర్ల నీటిని వాడతారని, 50 వేల లీటర్ల కలుషిత నీటిని విడుదల చేస్తారని చెప్పారు. ఈ కారణంగా తాగు, సాగునీరు కలుషితమై ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. ఆక్వా పార్క్ యాజమాన్యం భూములు కొనుగోలు చేసే సమయంలో అక్కడి రైతులకు చేపల చెరువులు తవ్వుతామని నమ్మించిం దన్నారు. ఆ భూముల్లో కాలుష్యాన్ని వెదజల్లే ఆక్వా పార్క్ నిర్మిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు అదే యాజమాన్యానికి కొమ్ముకాయడంలో ఆంతర్యం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన కారణంగా రైతులు, రైతు కూలీలు, మత్స్యకారుల జీవనం దుర్భరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు : శేషుబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ ప్రజలను జైలులో పెట్టి ఆక్వా పార్క్ నిర్మించాలనుకుంటున్న ప్రభుత్వానికి వారే తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రాభివృద్ధికి, ఫ్యాక్టరీల నిర్మాణానికి వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదని, ప్రజలు వ్యతిరేకిస్తున్న తుందుర్రు ఆక్వాఫుడ్ పార్క్‌ను వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు. పార్టీ నాయకుల బృందం ఆక్వా పార్క్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుకుందని, అక్కడి పరిస్థితులను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ రఫీయుల్లాబేగ్ మాట్లాడుతూ ఇప్పటికే ఇసుక మాఫియగా తయారైన టీడీపీ నేతలు ఫ్యాక్టరీల పేరిట మరింత దోచుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఐద్యా రాష్ట్ర కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ గోదావరి జిల్లాల ప్రజలు చుట్టూ నది ప్రవహిస్తున్నా తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్నారని.. పర్యావరణానికి హాని కలిగించే ఆక్వా పార్క్ వంటివి నిర్మిస్తే రానున్న రోజుల్లో ఆక్సిజన్ కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సభకు అధ్యక్షత వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బల రామ్ మాట్లాడుతూ ఆక్వా పార్క్ ప్రభుత్వ వాటాతో నిర్మిస్తున్నట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని, దీని ఒప్పంద పత్రంలో ప్రైవేట్ కంపెనీ అని స్పష్టంగా ఉందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి, ప్యాక్టరీల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేసే ఫుడ్‌పార్క్‌ను జనావాసాలు లేని ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. తుందుర్రులో ఆక్వా పార్క్‌కు బదులుగా ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆక్వా పార్క్ ప్రభావిత గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ శిబిరాలను, నిర్బంధాలను తక్షణమే తొలగించి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరారు. ఫుడ్‌పార్క్ నిర్మాణం నిలిపివేసేవరకు పోరాటం ఆగదన్నారు. బహిరంగ సభలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పేరిచర్ల విజయనరసింహరాజు, భీమవరం, నరసాపురం మునిసిపాలిటీల్లో వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్స్ గాదిరాజు వెంకట సత్యసుబ్రహ్మణ్యంరాజు (తాతరాజు), ద్వారా సాయినాథ్ ప్రసాద్, సీపీఐ నాయకురాలు పెన్మెత్స దుర్గాభవాని, ఎంసీపీఐ నాయకుడు శానంపూడి నాగరాజు, సీపీఎం రాష్ట్ర నాయకురాలు డి.రమాదేవి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గన్నాబత్తుల సత్యనారాయణ, మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి శ్రీనివాస్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు డి.కల్యాణి, తుందుర్రు ఎంపీటీసీ జవ్వాది వెంకటరమణ, నాయకులు గంగరాజు, పెందుర్తి దుర్గాభవాని, జేఎన్వీ గోపాలన్ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన జనం బహిరంగ సభకు భీమవరం, మొగల్తూరు, నరసాపురం, వీరవాసరం మండలాల నుంచి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు ఆటోలు, వ్యాన్లు వంటి వాహనాలపై చేరుకున్నారు. ఆక్వా పార్క్ ప్రభావిత ప్రాంతాల నుంచి మహిళలు చంటిబిడ్డలతో హాజరుకావడంతో ఆక్వా పార్క్ నిర్మాణంపై ప్రజల నుంచి ఏ మేరకు వ్యతిరేకత ఉందో అవగతమవుతోందనే వ్యాఖ్యలు వినిపించాయి. మహిళలతో మమేకమైన బృందాకరత్ బృందాకరత్ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్న వెంటనే సభకు హాజరైన మహిళల వద్దకు వెళ్లి వారితో మమేకమయ్యారు. వారు ఎదుర్కొం టున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మహిళలు అధైర్యపడవద్దని, తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.