ఇటుక పేర్చినా యుద్ధమే
Published Sat, Nov 5 2016 1:55 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
నరసాపురం :‘గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ పేరుతో మా ఇళ్లమధ్య కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీ కడుతున్నారు. మా పంటలు పాడైపోతాయి. మా ఆరోగ్యాలు గాలిలో కలిసిపోతాయి. భూములు బీడువారి రైతులు బికారులవుతారు. మత్స్యకారులు, కూలీలు ఉపాధి కోల్పోయి ఊళ్లొదిలి పోవాల్సి వస్తుంది. ఆక్వా పార్క్ ఇక్కడ కట్టొద్దని రెండేళ్లుగా పోరాటం చేస్తున్నాం. మా వేదనపై పోలీస్ జులుం ప్రదర్శించారు. హత్యానేరాలు మోపి జైళ్లలో పెట్టించారు. ఇంతాచేసి మాకు నచ్చజెప్పడానికి ఇప్పుడు ఎమ్మెల్యేలు వస్తారా. ధైర్యముంటే పోలీస్ బందోబస్తు లేకుండా రండి. చెప్పులు, చీపుర్లతో సమాధానం చెబుతాం’ అని ఆక్వాపార్క్ ప్రభావిత గ్రామాల ప్రజలు హెచ్చరించారు. ‘ఇకముందు ఫ్యాక్టరీ నిర్మాణంలో ఇటుక పేర్చినా యుద్ధమే. ప్రజలు కావాలో.. ఇద్దరు పారిశ్రామిక వేత్తలు కావాలో చంద్రబాబు తేల్చుకోవాలని అఖిల పక్షం నాయకులు చంద్రబాబుకు సవాల్ విసిరారు. తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భీమవరం, నరసాపురం, వీరవాసరం, మొగల్తూరు మండలాలకు చెందిన వేలాది మహిళలు శుక్రవారం నరసాపురం తరలివచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటాన్ని కొనసాగిస్తామని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ, వామపక్ష, ఇతర పార్టీల నాయకులు మద్దతు పలికారు. బాధితులకు అండగా నిలుస్తామని, పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళతామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాదిమంది నినాదాలు చేయ డంతో చేయడంతో సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంతం దద్దరిల్లింది.
ఫ్యాక్టరీ తరలిస్తే శ్రమదానం చేస్తాం : ఆళ్ల నాని
మహాధర్నా సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. ఆక్వా పార్క్ కాలుష్యాన్ని సముద్రంలోకి తరలించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి పైప్‌లై¯ŒS వేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ‘ఫ్యాక్టరీ నీదా.. నీ అనుయాయులదా.. లేక భారీగా వాటాలున్నాయా. ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీకి ప్రభుత్వ సొమ్ముతో పైప్‌లై¯ŒS వేయాలనే ఉత్సాహం ఎందుకని ప్రశ్నిం చారు. పరిశ్రమల ఏర్పాటుకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదని, పరిశ్రమలు రావాలని, అభివృద్ధి జరగాలన్నదే తమ అభిమతమని నాని చెప్పారు. అయితే, ప్రజల కడుపుపై కొట్టి అదే అభివృద్ధి అంటే ఊరుకునే పరిస్థితి లేదన్నారు. ఇదే ఫ్యాక్టరీని సముద్రతీరానికి తరలిస్తే తామూ శ్రమదానం చేస్తామని చెప్పారు. ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, గ్రామాల్లో 144 సెక్ష¯ŒS ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. తుందుర్రు ఆక్వాపార్క్ విషయంలో తమ పార్టీ అధినేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఒకే నిర్ణయంతో ఉన్నారన్నారు. తుందుర్రు రావద్దని ఆయనపై ఎన్నో ఒత్తిళ్లు తెచ్చారని, ఇక్కడ ఏ సమస్యా లేదని చెప్పారని అన్నారు. తనకు పార్టీ ప్రయోజనాలతో పనిలేదని, జనం అభిప్రాయమే ముఖ్యమని భావించి వైఎస్ జగ¯ŒS తుందుర్రు పర్యటనకు వచ్చారని వివరించారు. ఆక్వాపార్క్‌ను ఇక్కడి నుంచి తరలించేవరకు వైఎస్సార్ సీపీ నిద్రపోదన్నారు. నరసాపురం, భీమవరం ఎమ్మెల్యేలు ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడాలని, లేదంటే చంద్రబాబుతోపాటు వాళ్లూ బంగాళాఖాతంలో కలుస్తారని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఆక్వా పార్క్ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తే సహించేది లేదన్నారు. అన్ని స్థానాలనూ కట్టబెట్టిన జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు రుణం తీర్చుకుంటానంటూ కక్షగట్టి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తుం దుర్రు ఫ్యాక్టరీ కారణంగా గొంతేరు కాలుష్యం అవుతుందన్నారు. వేలాదిమంది మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని, పంట భూములు బీడుగా మారి రైతులు బికారులుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తాము గడపగడపకూ తిరుగుతున్నామని, దాదాపు ప్రతి గడపలోనూ చంద్రబాబు రాక్షస పాలనతో కన్నీరే కనిపిస్తోందని చెప్పారు. 40 గ్రామాల వారు ఫ్యాక్టరీ వద్దు బాబోయ్ అని ముక్తకంఠంతో చెబుతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ మోసపూరిత కబుర్లు చెప్పడం, పరిశ్రమల పేరుతో దోచుకోవడమే పరమావధిగా ముఖ్యమంత్రి ముందుకెళుతున్నారని విమర్శించారు.
పరిశ్రమల వ్యతిరేకివి నువ్వే : ఉమామహేశ్వరరావు
పరిశ్రమల పేరుతో సాగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే సీపీఎం వాళ్లు టెర్రరిస్టులు.. వైఎస్సార్ సీపీ వాళ్లు పరిశ్రమలకు అడ్డుతగులుతున్నారంటూ చంద్రబాబు నోరు పారేసుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మూతపడ్డ 15వేల పరిశ్రమలను తెరి పించడంలో ముఖ్యమంత్రి ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. వాటిని తెరిపిస్తే కమీషన్లు పెద్దగా రావని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో పారిశ్రామిక వేత్తలతో సమావేశం పెట్టి రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారని, ఎన్ని కోట్లు పెట్టుబడులు వచ్చాయని నిలదీశారు. పరిశ్రమల ఏర్పాటుకు తామెవరూ వ్యతిరేకం కాదని, చంద్రబాబే వ్యతిరేకి అని పేర్కొన్నారు. ‘ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, అంజిబాబు, మాధవనాయుడు చంద్రబాబు ఆదేశాలతో మీ వద్దకు వచ్చి ఫ్యాక్టరీ కట్టాలని నచ్చజెబుతారంట. మరి మీరేం చేస్తారు’ అని ప్రజలను ప్రశ్నించారు. మహిళలు చేతులు పైకెత్తి చెప్పులు, చీపుర్లతో సమాధానం చెబుతామన్నారు. మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ భీమవరం ఎమ్మెల్యే అర్ధరాత్రి వేళ తుందుర్రు గ్రామానికి రావాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. జనసేన జిల్లా నాయకుడు సాగర్‌బాబు మాట్లాడుతూ ఫ్యాక్టరీని వేరే ప్రాంతానికి తరలించాలని పవ¯ŒSకల్యాణ్ బుద్ధుడుగా సూచన చేశారని, తరలించకపోతే ఆయన రుద్రుడుగా మారతారని హెచ్చరించారు. పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, ఆరేటి సత్యవతి, ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ తాము ఎంతకాలమైనా జైలు జీవితం గడపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే ఆర్.సత్యనారాయణరాజు, సీపీఐ నాయకుడు నెక్కంటి సుబ్బారావు, మునిసిపల్ ఫ్లోర్‌లీడర్ సాయినా«థ్ ప్రసాద్, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ మాట్లాడారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, ప్రచార కమిటీ కన్వీనర్ ఎల్.సుధీర్‌బాబు, అధికార ప్రతినధి ఎం.జయప్రకాశ్, సీపీఎం నేతలు జేఎ¯ŒSవీ గోపాలన్, కవురు పెద్దిరాజు, ఐద్వా జిల్లా కార్యదర్శి కమల తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement