ఆక్వా ఫుడ్ పార్కు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం సరికాదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ప్రజల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బాధిత ప్రాంతాలపై ప్రభుత్వ వైఖరి సరికాదని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ లెక్కలన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయని బుగ్గన విమర్శించారు. వాస్తవాలను చెబుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని బుగ్గన వ్యాఖ్యానించారు. అందుకే ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తున్నారని ఆయన అన్నారు.
Published Wed, Mar 8 2017 2:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
Advertisement