సాక్షి, న్యూఢిల్లీ : తుందుర్రు మెగా ఆక్వా పుడ్ పార్క్‌ను వల్ల ఆ ప్రాంతంలో ఏర్పడుతున్న కాలుష్యం, దుర్వాసనపై సంయుక్త తనిఖీలు చేపట్టాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో మెగా ఆక్వా పుడ్ పార్క్ నిర్మాణం చేపట్టారని ఎస్‌సుబ్రహ్మణ్యం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కాలుష్య నియంత్రణ మండలి విధించిన షరతులకు లోబడే పరిశ్రమను నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని తనిఖీలు చేయడాలని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలను ఆదేశించింది.
అనుమతులకు విరుద్ధంగా ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మెగా పుడ్ పార్క్ వ్యర్థాలను పంపేందుకు పరిశ్రమ నుంచి సముద్రంలోకి వేసిన పైప్‌లైన్ అంశంపై తమ స్పందనను తెలియజేయాలని ఏపీ ప్రభుత్వానికి ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమ నుంచి వచ్చే దుర్వాసన, కాలుష్యంకు సంబంధించిన నివేదికలు ఎన్టీటీకి సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment