tundurru mega aqua food park
-
షరతులకు లోబడే ఆ పరిశ్రమను నిర్వహిస్తున్నారా?
సాక్షి, న్యూఢిల్లీ : తుందుర్రు మెగా ఆక్వా పుడ్ పార్క్ను వల్ల ఆ ప్రాంతంలో ఏర్పడుతున్న కాలుష్యం, దుర్వాసనపై సంయుక్త తనిఖీలు చేపట్టాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో మెగా ఆక్వా పుడ్ పార్క్ నిర్మాణం చేపట్టారని ఎస్సుబ్రహ్మణ్యం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కాలుష్య నియంత్రణ మండలి విధించిన షరతులకు లోబడే పరిశ్రమను నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని తనిఖీలు చేయడాలని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలను ఆదేశించింది. అనుమతులకు విరుద్ధంగా ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మెగా పుడ్ పార్క్ వ్యర్థాలను పంపేందుకు పరిశ్రమ నుంచి సముద్రంలోకి వేసిన పైప్లైన్ అంశంపై తమ స్పందనను తెలియజేయాలని ఏపీ ప్రభుత్వానికి ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమ నుంచి వచ్చే దుర్వాసన, కాలుష్యంకు సంబంధించిన నివేదికలు ఎన్టీటీకి సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలకు సూచించింది. -
పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో ఉద్రిక్తత
-
తుందుర్రులో ఉద్రిక్తత
సాక్షి, భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుందుర్రులో ఆక్వాఫుడ్ పార్క్ పైప్లైన్ నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు సీపీఎం నేతలు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అయితే సీపీఎం నేతలను అన్యాయంగా అరెస్టు చేశారంటూ ఆ పార్టీ కార్యకర్తలు, పార్క్ బాధితులు నిరసన తెలుపుతున్నారు. ఆక్వాఫుడ్ పార్క్ వద్దంటూ 33 గ్రామాల ప్రజలు పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే. -
జైలు నుంచి ఆక్వా ఉద్యమకారులు విడుదల
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ జైలు నుంచి మెగా ఆక్వా పార్కు ఉద్యమకారులు ఆరుగురు మంగళవారం విడుదలయ్యారు. గోదావరి మెగా ఆక్వా పుడ్ పార్క్కు వ్యతిరేకంగా పోరాడంతో పోలీసులు పలువురిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. 50 రోజులుగా జైలులో ఉన్న ఆరేటి వాసు, ముచ్చెర్ల త్రిమూర్తులు, బెల్లపు సుబ్రహ్మణ్యం, కొయ్యే మహేష్, కలిగిత సుందరావులకు బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదల అయ్యారు. ఉద్యమకారులకు ఆక్వాపుడ్ పార్క్ బాధిత గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సబ్జైలు నుంచి తుందుర్రు బాధితురాలు ఆరేటి సత్యవతి కూడా నిన్న బెయిల్ పై విడుదలయిన విషయం తెలిసిందే.