
సాక్షి, భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుందుర్రులో ఆక్వాఫుడ్ పార్క్ పైప్‌లైన్ నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు సీపీఎం నేతలు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు.
దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అయితే సీపీఎం నేతలను అన్యాయంగా అరెస్టు చేశారంటూ ఆ పార్టీ కార్యకర్తలు, పార్క్ బాధితులు నిరసన తెలుపుతున్నారు. ఆక్వాఫుడ్ పార్క్ వద్దంటూ 33 గ్రామాల ప్రజలు పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment