మృతదేహాలతో ఆందోళన
జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఆత్మహత్యకు పాల్పడిన భార్యాభర్తల ఘటన శుక్రవారం ఆందోళనకు దారితీసింది. ఆటోమొబైల్ వ్యాపారి చిక్కాల సీతారామరాజు (రాజా), భార్య శ్రీదేవి గురువారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సూసైడ్ నోట్ రాసి వీరు బలవన్మరణం చెందారు. వీరి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులను వెంటనే తీసుకురావాలని, అప్పటివరకు మృతదేహాలకు అంత్యక్రియలు జరపమని రాజా తల్లి ఝాన్సీ, బంధువులు భీష్మించారు. చివరకు బం ధువులు, స్నేహితుల సూచనల మేరకు అంత్యక్రియలకు తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో పోలీస్‌స్టేషన్ వద్ద మృతదేహాలను తీసు కువెళ్తున్న వాహనాన్ని నిలిపి ఆందోళన చేయాలని నిర్ణయిం చుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు స్టేషన్ వద్ద ఆం దోళనకు అంగీకరించలేదు. తమకు న్యాయం జరిపించాలని మృతుని తల్లి ఝాన్సీ సీఐ శ్రీనివాస్‌యాదవ్‌ను వేడుకున్నారు. ఆత్మహత్యకు కారకులైన వారిపై కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. దీంతో మృతదేహాలను అంత్యక్రియలకు తీసుకువెళ్లారు.