సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్ మళ్లీ పోరు బాట పట్టనుంది. తర్వలో నీటి పోరు యాత్ర చేసేందుకు పార్టీ యోచిస్తోంది. దక్షిణ తెలంగాణలోని నాగార్జున సాగర్, ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం నుంచి నీటి పోరు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ పెద్దలు ప్లాన్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతోంది. ఇటీవలే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై నల్గొండలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న బీఆర్‌ఎస్ ఇదే ఊపులో నీటి పోరుయాత్ర చేసి తమ పాలనకు, కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కారు పార్టీ డిసైడైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తుచేసేందుకే ఈ యాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందని ఊహాగానాల నేపథ్యంలో ఇరు పార్టీల సీనియర్ నేతలు దానిని ఖండిస్తున్నారు. కానీ ఎన్నికల వేళ కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పొత్తుపై బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment