
విజయవాడ: నగరంలోని ఇందిరా గాంధీ స్టేడియం వద్ద పీఈటీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. స్టేడియం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన 1056 పోస్టులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 47 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామనడాన్ని పీఈటీ అభ్యర్థులు తప్పుబట్టారు.
అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మంత్రి గంటా శ్రీనివాస రావు ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆరోపించారు. 1056 పోస్టులు భర్తీ చేయనపుడు, 20 వేల మందికి టెట్ ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. ప్రభుత్వం 1056 పోస్టులు ప్రకటించకపోతే మాకు చావే శరణ్యమని అభ్యర్థులు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment