
న్యాయవాదుల నిరసన
తిరువూరు: స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాదిపై సోమవారం సాయంత్రం జరిగిన దాడి సంఘటనను నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు విధులు బహిష్కరించారు. కక్షిదారుతో కోర్టు ఆవరణలో మాట్లాడుతున్న తనపై ప్రతివాది బడుగు భాస్కరరావు దాడిచేశారని న్యాయవాది వాకదాని లక్ష్మీనారాయణ జడ్జికి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రేగళ్ళ మోహనరెడ్డి డిమాండ్ చేశారు. ఆందోళనలో న్యాయవాదులు సంకురాత్రి జనార్థనరావు, మాకరాజు రాంమోహనరాజు, అత్తునూరు ప్రభాకరరెడ్డి, మేకల నాగేంద్రప్రసాద్, మోదుగుమూడి శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, సీత, శ్రీనివాసరావు, మురహరి పాల్గొన్నారు.