న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ యాప్‌లో తాను ప్రతి రోజూ ఉదయం ఎంపీలందరికీ గుడ్‌మార్నింగ్ చెప్తున్నప్పటికీ ఎవరూ స్పందించడం లేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఓ ఐదారుగురు నేతలు మాత్రమే తన సందేశాలకు ప్రతిస్పందిస్తున్నారన్నారు. బీజేపీ పార్లమెంటరీ విభాగం వారంతపు భేటీలో మోదీ ఈ మేరకు స్పందించారు. మోదీ యాప్‌ను విరివిగా వాడాలని ఆయన ఎంపీలకు ఈ సందర్భంగా సూచించారు. గుడ్‌మార్నింగ్‌తో పాటు తాను పంపే ముఖ్యమైన విషయాలనూ ఎంపీలు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో ప్రారంభించిన ఈ యాప్‌ను మోదీ ఇటీవల ముగిసిన గుజరాత్ ఎన్నికల్లోనూ విరివిగా వాడారు. పార్లమెంటుకు సరిగ్గా హాజరుకాని ఎంపీలకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు దక్కవని ఆగస్టులో మోదీ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment