Good morning
-
నాకెవరూ గుడ్‌మార్నింగ్ చెప్పట్లేదు: మోదీ
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ యాప్‌లో తాను ప్రతి రోజూ ఉదయం ఎంపీలందరికీ గుడ్‌మార్నింగ్ చెప్తున్నప్పటికీ ఎవరూ స్పందించడం లేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఓ ఐదారుగురు నేతలు మాత్రమే తన సందేశాలకు ప్రతిస్పందిస్తున్నారన్నారు. బీజేపీ పార్లమెంటరీ విభాగం వారంతపు భేటీలో మోదీ ఈ మేరకు స్పందించారు. మోదీ యాప్‌ను విరివిగా వాడాలని ఆయన ఎంపీలకు ఈ సందర్భంగా సూచించారు. గుడ్‌మార్నింగ్‌తో పాటు తాను పంపే ముఖ్యమైన విషయాలనూ ఎంపీలు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో ప్రారంభించిన ఈ యాప్‌ను మోదీ ఇటీవల ముగిసిన గుజరాత్ ఎన్నికల్లోనూ విరివిగా వాడారు. పార్లమెంటుకు సరిగ్గా హాజరుకాని ఎంపీలకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు దక్కవని ఆగస్టులో మోదీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
పెళ్లికి బాజా మోగింది
జిల్లా అంతటా శుభకార్యాల సందడి ఆర్నెళ్ల ముందే రిజర్వయిన కల్యాణమంటపాలు పేరున్న పురోహితులకు అడ్వాన్స్ చెల్లింపులు ఆ మూడు రోజుల్లోనే మూడుముళ్లకు మొగ్గుచూపుతున్న జంటలు ఆగస్టులో మంచి ముహూర్తాలు అనంతపురం కల్చరల్: జిల్లా వ్యాప్తంగా పెళ్లి సందడి కనపడుతోంది. సాధారణంగా శ్రావణ మాసం పెళ్లిళ్లకు శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో చాలా ముహూర్తాలున్నా ఆగస్టు 09. 12, 17 తేదీల్లోనే ఎక్కువగా వివాహాలు నిశ్చయమైనాయి. ఇవన్నీ కూడా అత్యంత మంచి ముహూర్తాలు కావడంతో వేలాది జంటలు ఒకటి కానున్నాయి. ఇప్పటికే ఈనెల 2న మంచి ముహూర్తం వెళ్లిపోయింది. ఇక రానున్న మంచి ముహూర్తాల్లోనే వివాహాలతో పాటు గృహ ప్రవేశాలు, అన్నప్రాసనలు, నామకరణోత్సవాలు, అక్షరభ్యాసాలు వంటి శుభకార్యాలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని కళ్యాణ మంటపాలు, ఫంక్షన్ హాళ్లు , దేవాలయాలు, విద్యా సంస్థలు, ఆఖరుకు కళాసంస్థలు కూడా వివాహాలకు వేదికలుగా మారాయి. ఇప్పటికే జిల్లాలోని అన్ని ఫంక్షన్ హాళ్లు, ఆలయాలలోని కల్యాణ వేదికలు మందుగానే రిజర్వు అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. పెన్నహోబిలం, రాప్తాడులోని పండమేటి వేంకటేశ్వరాలయం వంటి ఆలయాల్లోని కల్యాణమంటపాలున్న చోట్ల ఒకేరోజు రెండు, మూడు కంటే ఎక్కువ వివాహాలు జరుగుతున్నాయి. పెరిగిన డిమాండ్ పెళ్లిళ్లలన్నీ ఒకటి రెండు ముహూర్తాల్లోనే ఎక్కువగా ఉండడంతో పురోహితులు, భజంత్రీలు, సప్లయర్స్, క్యాటరింగ్ తదితర వాటికీ విపరీతమైన డిమాండు ఏర్పడింది. అలాగే పూల దుకాణాలు, గిఫ్ట్ షాపులు కూడా జనంతో రద్దీగా మారుతున్నాయి. ఆలయాల్లోని గదులు బంధుమిత్రులకు సరిపోకపోవడంతో సమీప ప్రాంతాల్లోని లాడ్జిలను బుక్ చేస్తున్నారు. ఈనేథ్యంలో జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలలోని లాడ్జిలు రిజర్వ్ అయిపోవడమే కాకుండా వాటి అద్దెలు కూడా పెరిగినట్టు వ«ధూవరుల తల్లిదండ్రులు చెబుతున్నారు. పెరిగిన డిమాండ్ నేపథ్యంలో కల్యాణ మంటపాలకు లక్షలాది రూపాయలు అద్దె వసూలు చేస్తుండడంతో ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగానే ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో కేవలం రూ.6 వేలకే కల్యాణమంటపం అద్దెకు దొరుకుతుండడంతో అందరూ అక్కడికి పరుగు తీస్తున్నారు. అందువల్లే ఇక్కడ ఆర్నెళ్లు ముందుగానే కల్యాణ మంటపం రిజర్వు అవుతోంది. సమయం చాలడం లేదు శ్రావణమాసంలో శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే. అయినా ఈసారి బలమైన ముహూర్తాలు కేవలం రెండు మూడు మాత్రమే ఉన్నాయి. మళ్లీ అక్టోబర్ నెలలోకూడా ఒకటి రెండు ముహూర్తాలు మాత్రమే బాగున్నాయి. తర్వాత వరుస ముహూర్తాలు కావాలంటే నవంబర్ 23 నుండి 30 వరకు ఆగాల్సిందే. దాంతో ఈ శ్రావణంలో సమయం అసలు చాలడం లేదు. వివాహాలంటే అదరాబదరా చేయించలేం..కొందరు విధి లేక ఒకేరోజు రెండు మూడు శుభకార్యాలు చేయిస్తున్నారు. –కరణం వాసుదేవరావు, పురోహితులు, రాప్తాడు. ఆరు నెలల ముందే బుక్ అయిపోయాయి ఈ సారి ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. మంచి ముహూర్తాలున్న రోజుల్లో ఆరు నెలలకు ముందుగానే బుక్ చేసుకున్నారు. కనీసం మూడు నెలల కిందటే చెబితే తప్ప అద్దెకివ్వలేని స్థితి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఇదే నెలలో ఎక్కువగా జరుగుతున్నాయి. –మోహనయ్య, మేనేజర్, టీటీడీ కల్యాణమండపం -
ఆ మూడు వలయాల్లో...
‘‘గుడ్ మార్నింగ్ ఆంటీ!’’ ఆదివారం పొద్దుటే తనను ఆంటీ అని పిలిచిందెవరా అని చూసింది రేఖ. చరణ్. ‘‘హాయ్ హీరో! గుడ్‌మార్నింగ్. ఏంటీ పొద్దున్నే ఆంటీ గుర్తొచ్చింది?’’ ‘‘మొన్న మీరు చెప్పిన స్టీఫెన్ కవీ ‘ఫస్ట్ థింగ్స్ ఫస్ట్’ చదివానాంటీ. బావుంది. నా టైమ్ టేబుల్ కూడా మార్చుకున్నా. అయినా టైమ్ మేనేజ్మెంట్ కొంచెం కష్టంగానే ఉంది. మీరింకేమైనా టిప్స్ చెప్తారేమోనని...’’ ‘‘గుడ్, వెరీగుడ్. నీకు నువ్వుగా టిప్స్ కోసం వచ్చావని తెలిస్తే మీ అమ్మ చాలా సంతోషిస్తుందోయ్. నీ టైమ్ ఎందుకు సరిపోవడంలేదో చెక్ చేసుకున్నావా?’’ ‘‘హా.. చెక్ చేసుకున్నా. కానీ అర్థం కావడంలేదు.’’ ‘‘ఓకే. ఖాళీ టైమ్‌లో ఏం చేస్తుంటావో చెప్పు.’’ ‘‘న్యూస్ పేపర్ చదువుతాను. టీవీలో డిస్కషన్స్ చూస్తాను. మేగజైన్స్‌లో గాసిప్స్ చదువుతాను. ఫ్రెండ్స్‌తో ఫోన్లో మాట్లాడతాను. నా గురించి క్లాస్మేట్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుంటాను.’’ ‘‘ఇంకా...’’ ‘‘ఇంకా అంటే... సెలబ్రిటీల గురించి చదువుతుంటాను. ఎకానమీ, ట్రాఫిక్ గురించి ఆలోచిస్తుంటాను. రాజకీయాలపై చర్చిస్తుంటా. అంతే ఆంటీ.’’ ‘‘గుడ్... వాటికి ఎంత టైమ్ కేటాయిస్తావ్?’’ ‘‘న్యూస్ పేపర్, డిస్కషన్స్, గాసిప్స్ అండ్ ఫ్రెండ్స్‌కు కలిపి... ఓ గంట లేక రెండు గంటలు.’’ ‘‘చాలా సమయం కేటాయిస్తున్నావ్. సరే... వాటికి అంత టైమ్ కేటాయిస్తున్నావ్ కదా... వాటిల్లో ఏ ఒక్కదాన్నైనా నువ్వు మార్చగలవా?’’ ‘‘వాటిని నేనెలా మార్చగలనాంటీ? ఇంపాజిబుల్!’’ ‘‘అంటే కొన్ని విషయాలను మనం మార్చలేకపోయినా వాటి గురించి ఆలోచిస్తుంటాం, ఆందోళన పడుతుంటాం. అటువంటివన్నీ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ లేదా ఆందోళనా వలయం అంటారు.’’ ‘‘అవునాంటీ. అప్పుడప్పుడూ ఈ ట్రాఫిక్ చూసి చాలా టెన్షన్ పడుతుంటా. అలాగే ఫ్యూచర్ ఎలా ఉంటుందోనని భయపడుతుంటా.’’ ‘‘కదా... వాటిని మనం మార్చలేమని తెలిసినా వాటి గురించి ఆలోచిస్తూ, ఆందోళన పడుతూ టైమ్ వేస్ట్ చేస్తుంటాం. ఆ వలయం దాటి బయటకు రావాలి.’’ ‘‘ఓ... తప్పకుండా వస్తా ఆంటీ.’’ ‘‘గుడ్.. నువ్వు ఏదైనా ప్రోగ్రామ్‌ను లీడ్ చేస్తున్నావా? లేదంటే వాలంటీర్‌గా పనిచేస్తున్నావా? ఏమైనా రాస్తుంటావా? రేడియో, టీవీ షోలలో ఎప్పుడైనా పాల్గొన్నావా?’’ ‘‘పెద్దగా లేదాంటీ. అప్పుడెప్పుడో ఓ టీవీ షోలో కనిపించా. మా కాలేజీ మేగజైన్‌కు ఓ కవిత రాశా... అంతే.’’ ‘‘ఇప్పుడు నేను చెప్పినవి సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లూయెన్స్ లేదా ప్రభావ వలయం అంటారు. అలాంటి పనులు చేయడం ద్వారా, నీ భావాలను పంచుకోవడం ద్వారా నువ్వు ఇతరులను ప్రభావితం చేయగలవు. ఇతరులకు ఆదర్శంగా నిలవగలవు.’’ ‘‘ఇంట్రెస్టింగ్... ఇంకా ఇలాంటి వలయాలు ఉన్నాయా ఆంటీ?’’ ‘‘హా... సర్కిల్ ఆఫ్ కంట్రోల్ లేదా నియంత్రణా వలయం ఉంది.’’ ‘‘అందులో ఏముంటాయ్?’’ అసక్తిగా అడిగాడు చరణ్. ‘‘నువ్వు నియంత్రించగలవన్నీ ఈ వలయంలో ఉంటాయి’’ చెప్పింది రేఖ. ‘‘అంటే...’’ అర్థం కానట్లుగా చూశాడు చరణ్. ‘‘అంటే... నువ్వేం చదువుతున్నావ్, ఏం నేర్చుకుంటున్నావ్, ఎవరికి ఓటేస్తున్నావ్, నీ ఖాళీ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నావ్, ఏం తింటున్నావ్, ఎలా ఖర్చు పెడుతున్నావ్, రోజుకు ఎంతసేపు వ్యాయామం చేస్తున్నావ్... ఇవన్నీ’’ చెప్పింది రేఖ. ‘‘ఓహ్... మరి ఇందాక రాజకీయాలపై చర్చించడం అనవసరం అన్నట్లు చెప్పారుగా’’ సందేహం వ్యక్తం చేశాడు. ‘‘అవును... రాజకీయాల గురించి గంటలు గంటలు మాట్లాడినా మనం ఏమీ మార్చలేము కాబట్టి అది ఆందోళనా వలయంలోకి వస్తుంది. కానీ నువ్వు ఏ పార్టీకి ఓటు వేస్తావన్నది దేశ భవిష్యత్తునే నిర్ణయిస్తుంది కాబట్టి అది నియంత్రణా వలయంలోకి వస్తుంది’’ చెప్పింది రేఖ. ‘‘నిజమే ఆంటీ... ఇంకా ఏముంటాయాంటీ మూడో వలయంలో.’’ ‘‘నీ వైఖరి, నీ ఉత్సాహం, నీ స్కిల్స్, నీ లీడర్షిప్... వాటిని పొందేందుకు నువ్వు చేసే ప్రయత్నం, నువ్వు రాసే ఆర్టికల్స్... ఇవన్నీ నియంత్రణా వలయంలోకే వస్తాయి.’’ ‘‘ఓకే... అంటే మనం మూడో వలయంలో ఎక్కువ టైమ్ గడపాలి.’’ ‘‘అవును... మొదటి వలయంలోని విషయాల గురించి ఎంత ఆలోచించినా, ఆందోళన చెందినా మనం మార్చలేం కాబట్టి అక్కడ సమయం వృథా చేయొద్దు. రెండో వలయంలోని అంశాలను ప్రభావితం చేయగలిగినా.. అది కొంతవరకే. మూడో వలయంలోని అంశాలు నీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి కాబట్టి వాటికి నువ్వు ఎంత టైమ్ కేటాయిస్తే అంత సక్సెస్ అవుతావు. అలాగే నీ టైమ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అవుతుంది.’’ ‘‘థ్యాంక్స్ ఆంటీ’’ అంటూ లేచాడు చరణ్ హుషారుగా. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
షాకిచ్చి లేపుతుంది!
భలే బుర్ర అలారం కేకేస్తుంది గానీ, షాకిస్తుందేంటి అనుకుంటున్నారా? సాధారణంగా అలారం సెట్ చేసుకున్న టైముకి ఓ కేక వేసి మనల్ని నిద్ర లేపుతుంది. కుంభకర్ణుడి కజిన్ బ్రదర్స అయితే ఆ కేకకి లేవరు. దాంతో అది కేక మీద కేక వేసి విసిగిస్తూనే ఉంటుంది. అయినా లేవాలనిపించలేదో... స్నూజ్ బటన్ మీద ఒక నొక్కు నొక్కితే అది చప్పున నోరు మూసేస్తుంది. మనం మళ్లీ నిద్రను కంటిన్యూ చేసేయొచ్చు. కానీ పంతొమ్మిదేళ్ల సంకల్ప్సిన్హా తయారు చేసిన అలారం దగ్గర ఈ పప్పులేమీ ఉడకవు. యూపీలోని శారదా వర్సిటీలో ఆటో మొబైల్ ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువు తోన్న సంకల్ప్... ఓ అలారం తయారు చేశాడు. అది మహా మొండిఘటం. నిద్రపోయే ముందు మనం సెట్ చేసుకున్న టైముకి అది ఠంచనుగా కేక వేస్తుంది. కేక అంటే మరీ కర్ణకఠోరమైన కేకేం కాదులెండి. కొంచెం ఆహ్లాదభరితమైన కేకే! శ్రావ్యంగా ‘గుడ్ మార్నింగ్’ అనే పాటతో మనల్ని లేపాలని ప్రయత్నం చేస్తుంది. లేచామో సరే సరి. లేవకుండా దాని నోరు నొక్కాలని ప్రయత్నిస్తే మాత్రం అది మనకు ఓ పెద్ద జర్‌క ఇస్తుంది. ఎలా అనేగా? దాన్ని ఆపడానికి మనం స్నూజ్ బటన్ మీద చేయి వేయగానే... చిన్న షాక్ ఇస్తుంది. ఆ దెబ్బకు ఎంత మొద్దునిద్ర ముంచు కొస్తున్నా, ఉలిక్కిపడి లేవాల్సిందే. ఇందులో ఇంకో వెరైటీ సౌకర్యం కూడా ఉంది. మనకు ఎంత మోతాదులో షాక్ కావాలనుకుంటున్నామో ముందే సెట్ చేసి పెట్టుకోవచ్చు. చిన్న షాక్‌కి లేచే వాళ్లమైతే తక్కువ, మరీ మొద్దు నిద్రపోయే వాళ్లమైతే ఎక్కువ మోతాదును ఎంచు కోవాలి. గరిష్టస్థాయి షాక్ సెట్ చేసుకున్నా కూడా ఏం నష్టం లేదు. ఎందుకంటే, మనిషి శరీరానికి ఎటువంటి హానీ కలగని మేరకే ఇది షాక్ కొడుతుంది. ఆ విధంగానే దీన్ని రూపొందించానని చెబుతున్నాడు రూపకర్త సంకల్ప్.