ఆ మూడు వలయాల్లో... | short stories in funday | Sakshi
Sakshi News home page

ఆ మూడు వలయాల్లో...

Published Sat, Nov 7 2015 11:33 PM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

ఆ మూడు వలయాల్లో...

ఆ మూడు వలయాల్లో...

‘‘గుడ్ మార్నింగ్ ఆంటీ!’’
 ఆదివారం పొద్దుటే తనను ఆంటీ అని పిలిచిందెవరా అని చూసింది రేఖ. చరణ్.
 ‘‘హాయ్ హీరో! గుడ్‌మార్నింగ్. ఏంటీ పొద్దున్నే ఆంటీ గుర్తొచ్చింది?’’
 ‘‘మొన్న మీరు చెప్పిన స్టీఫెన్ కవీ ‘ఫస్ట్ థింగ్స్ ఫస్ట్’ చదివానాంటీ. బావుంది. నా టైమ్ టేబుల్ కూడా మార్చుకున్నా. అయినా టైమ్ మేనేజ్‌మెంట్ కొంచెం కష్టంగానే ఉంది. మీరింకేమైనా టిప్స్ చెప్తారేమోనని...’’
 
 ‘‘గుడ్, వెరీగుడ్. నీకు నువ్వుగా టిప్స్ కోసం వచ్చావని తెలిస్తే మీ అమ్మ చాలా సంతోషిస్తుందోయ్. నీ టైమ్ ఎందుకు సరిపోవడంలేదో చెక్ చేసుకున్నావా?’’
 ‘‘హా.. చెక్ చేసుకున్నా. కానీ అర్థం కావడంలేదు.’’
 ‘‘ఓకే. ఖాళీ టైమ్‌లో ఏం చేస్తుంటావో చెప్పు.’’
 ‘‘న్యూస్ పేపర్ చదువుతాను. టీవీలో డిస్కషన్స్ చూస్తాను. మేగజైన్స్‌లో గాసిప్స్ చదువుతాను. ఫ్రెండ్స్‌తో ఫోన్లో మాట్లాడతాను. నా గురించి క్లాస్‌మేట్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుంటాను.’’
 
 ‘‘ఇంకా...’’
 ‘‘ఇంకా అంటే... సెలబ్రిటీల గురించి చదువుతుంటాను. ఎకానమీ, ట్రాఫిక్ గురించి ఆలోచిస్తుంటాను. రాజకీయాలపై చర్చిస్తుంటా. అంతే ఆంటీ.’’
 ‘‘గుడ్... వాటికి ఎంత టైమ్ కేటాయిస్తావ్?’’
 ‘‘న్యూస్ పేపర్, డిస్కషన్స్, గాసిప్స్ అండ్ ఫ్రెండ్స్‌కు కలిపి... ఓ గంట లేక రెండు గంటలు.’’
 ‘‘చాలా సమయం కేటాయిస్తున్నావ్. సరే... వాటికి అంత టైమ్ కేటాయిస్తున్నావ్ కదా... వాటిల్లో ఏ ఒక్కదాన్నైనా నువ్వు మార్చగలవా?’’
 ‘‘వాటిని నేనెలా మార్చగలనాంటీ? ఇంపాజిబుల్!’’
 ‘‘అంటే కొన్ని విషయాలను మనం మార్చలేకపోయినా వాటి గురించి ఆలోచిస్తుంటాం, ఆందోళన పడుతుంటాం. అటువంటివన్నీ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ లేదా ఆందోళనా వలయం అంటారు.’’
 ‘‘అవునాంటీ. అప్పుడప్పుడూ ఈ ట్రాఫిక్ చూసి చాలా టెన్షన్ పడుతుంటా. అలాగే ఫ్యూచర్ ఎలా ఉంటుందోనని భయపడుతుంటా.’’
 ‘‘కదా... వాటిని మనం మార్చలేమని తెలిసినా వాటి గురించి ఆలోచిస్తూ, ఆందోళన పడుతూ టైమ్ వేస్ట్ చేస్తుంటాం. ఆ వలయం దాటి బయటకు రావాలి.’’
 ‘‘ఓ... తప్పకుండా వస్తా ఆంటీ.’’
 ‘‘గుడ్.. నువ్వు ఏదైనా ప్రోగ్రామ్‌ను లీడ్ చేస్తున్నావా? లేదంటే వాలంటీర్‌గా పనిచేస్తున్నావా? ఏమైనా రాస్తుంటావా? రేడియో, టీవీ షోలలో ఎప్పుడైనా పాల్గొన్నావా?’’
 ‘‘పెద్దగా లేదాంటీ. అప్పుడెప్పుడో ఓ టీవీ షోలో కనిపించా. మా కాలేజీ మేగజైన్‌కు ఓ కవిత రాశా... అంతే.’’
 
 ‘‘ఇప్పుడు నేను చెప్పినవి సర్కిల్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ లేదా ప్రభావ వలయం అంటారు. అలాంటి పనులు చేయడం ద్వారా, నీ భావాలను పంచుకోవడం ద్వారా నువ్వు ఇతరులను ప్రభావితం చేయగలవు. ఇతరులకు ఆదర్శంగా నిలవగలవు.’’
 ‘‘ఇంట్రెస్టింగ్... ఇంకా ఇలాంటి వలయాలు ఉన్నాయా ఆంటీ?’’
 ‘‘హా... సర్కిల్ ఆఫ్ కంట్రోల్ లేదా నియంత్రణా వలయం ఉంది.’’
 ‘‘అందులో ఏముంటాయ్?’’ అసక్తిగా అడిగాడు చరణ్.
 ‘‘నువ్వు నియంత్రించగలవన్నీ ఈ వలయంలో ఉంటాయి’’ చెప్పింది రేఖ.
 ‘‘అంటే...’’ అర్థం కానట్లుగా చూశాడు చరణ్.
 ‘‘అంటే... నువ్వేం చదువుతున్నావ్, ఏం నేర్చుకుంటున్నావ్, ఎవరికి ఓటేస్తున్నావ్, నీ ఖాళీ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నావ్, ఏం తింటున్నావ్, ఎలా ఖర్చు పెడుతున్నావ్, రోజుకు ఎంతసేపు వ్యాయామం చేస్తున్నావ్... ఇవన్నీ’’ చెప్పింది రేఖ.
 ‘‘ఓహ్... మరి ఇందాక రాజకీయాలపై చర్చించడం అనవసరం అన్నట్లు చెప్పారుగా’’ సందేహం వ్యక్తం చేశాడు.
 
 ‘‘అవును... రాజకీయాల గురించి గంటలు గంటలు మాట్లాడినా మనం ఏమీ మార్చలేము కాబట్టి అది ఆందోళనా వలయంలోకి వస్తుంది. కానీ నువ్వు ఏ పార్టీకి ఓటు వేస్తావన్నది దేశ భవిష్యత్తునే నిర్ణయిస్తుంది కాబట్టి అది నియంత్రణా వలయంలోకి వస్తుంది’’ చెప్పింది రేఖ.
 ‘‘నిజమే ఆంటీ... ఇంకా ఏముంటాయాంటీ మూడో వలయంలో.’’
 
 ‘‘నీ వైఖరి, నీ ఉత్సాహం, నీ స్కిల్స్, నీ లీడర్‌షిప్... వాటిని పొందేందుకు నువ్వు చేసే ప్రయత్నం, నువ్వు రాసే ఆర్టికల్స్... ఇవన్నీ నియంత్రణా వలయంలోకే వస్తాయి.’’
 ‘‘ఓకే... అంటే మనం మూడో వలయంలో ఎక్కువ టైమ్ గడపాలి.’’
 
 ‘‘అవును... మొదటి వలయంలోని విషయాల గురించి ఎంత ఆలోచించినా, ఆందోళన చెందినా మనం మార్చలేం కాబట్టి అక్కడ సమయం వృథా చేయొద్దు. రెండో వలయంలోని అంశాలను ప్రభావితం చేయగలిగినా.. అది కొంతవరకే. మూడో వలయంలోని అంశాలు నీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి కాబట్టి వాటికి నువ్వు ఎంత టైమ్ కేటాయిస్తే అంత సక్సెస్ అవుతావు. అలాగే నీ టైమ్ మేనేజ్‌మెంట్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అవుతుంది.’’
 ‘‘థ్యాంక్స్ ఆంటీ’’ అంటూ లేచాడు చరణ్ హుషారుగా.
 - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement