డాక్టర్ లక్ష్మీ అరెస్టు ఇంకెప్పుడు..?
డాక్టర్ లక్ష్మీ అరెస్టు ఇంకెప్పుడు..?
Published Fri, Oct 28 2016 7:42 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
గుంటూరు మెడికల్: ప్రొఫెసర్ ఏవీవీ లక్ష్మిని అరెస్ట్ చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. శుక్రవారం జూడాలు లక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆస్పత్రి చుట్టూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూడాల సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మి వేధింపులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఆమెకు ఉన్న పలుకుబడిని తట్టుకోలేక సదరు ప్రొఫెసర్ బదిలీ చేయించుకొని వెళ్లారని, నేడు డాక్టర్ లక్ష్మి వేధింపులపై సాక్ష్యం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పీజీ వైద్య విద్యను పూర్తి చేసుకున్న వారు, కొందరు రోగులు డాక్టర్‌పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైద్యులతోపాటు ఆయాలు, నర్సులు, రోగులందరూ ప్రొఫెసర్ లక్ష్మి దూషణలపై ఫిర్యాదు చేస్తున్నా ఎందుకు ఆమెను అరెస్ట్ చేయరంటూ ప్రశ్నించారు. రోగులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తమకు లేదని, న్యాయం కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ముగ్గురు వైద్యులతో కూడిన హైపవర్ కమిటీ శుక్రవారం కూడా జీజీహెచ్ వైద్యులు, వైద్య సిబ్బంది విచారించింది.
Advertisement
Advertisement