Sandhya Rani died
-
అస్తమించిన ‘సంధ్య’
హైదరాబాద్: ప్రేమోన్మాది నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు సంధ్యారాణి తుదిశ్వాస విడిచింది. గురువారం జరిగిన దాడి తర్వాత 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం 7.20 గంటల ప్రాంతంలో కన్నుమూసింది. దీంతో హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చిన లాలాపేట్ పోలీసులు నిందితుడు కార్తీక్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని వాటితోపాటు మరికొన్ని సెక్షన్లు జోడించారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావును నియమించినట్లు నార్త్‌జోన్ డీసీపీ బి.సుమతి పేర్కొన్నారు. బొల్లారం ఠాణాలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పూర్తి వివరాలు వెల్లడించారు. స్నేహాన్నే ప్రేమగా భావించి.. లాలాపేట్ కమాన్ ప్రాంతం వాసి ఎన్.సావిత్రి మూడో కుమార్తె సంధ్యారాణి. కొన్నాళ్ల క్రితం సంధ్యకు లాలాపేట్ ప్రాంతానికి చెందిన వి.కార్తీక్‌తో పరిచయం ఏర్పడింది. అప్పట్లో ఇతడు పనిచేస్తున్న లక్కీ ట్రేడర్స్లోనే ఆమెకూ ఉద్యోగం ఇప్పించాడు. కొన్నాళ్లకు కార్తీక్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. దీంతో సంధ్యను కూడా ఉద్యోగం మానేయాలని ఒత్తిడి చేయడం మొదలెట్టాడు. అయితే కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఆమె ఉద్యోగంలో కొనసాగింది. తన స్వభావరీత్యా అతడితో స్నేహపూర్వకంగా మెలిగింది. దీన్ని ప్రేమగా భావించిన కార్తీక్ ఆమె దగ్గర ప్రేమ, పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. కుటుంబ పోషణ భారం తనపై ఉండటం, సక్రమంగా ఉద్యోగం సైతం చేయలేని కార్తీక్ నైజం, జీవితంలో స్థిరపడని తత్వం నేపథ్యంలో ఆమె సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది. ఇదే విషయాన్ని తాను పనిచేస్తున్న దుకాణ యజమాని జగన్‌రెడ్డి ద్వారా పలుమార్లు కార్తీక్‌కు చెప్పించింది. అయినా కార్తీక్ ప్రవర్తనలో మార్పు రాకపోగా.. తరచు ఆమెకు ఫోన్లు చేసి వేధించడం మొదలెట్టాడు. ఓ సందర్భంలో కార్తీక్ ఆమెకు ఫోన్ చేయగా.. సహోద్యోగి ఫోన్ ఎత్తాడు. కార్తీక్ వేధింపుల విషయం సంధ్య ద్వారా తెలిసిన అతడు.. ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా ఫోన్లోనే కార్తీక్‌ను మందలించాడు. కక్షగట్టి.. పెట్రోల్ పోసి.. దీంతో సంధ్యపై కక్షగట్టి, ద్వేషం పెంచుకున్న కార్తీక్ గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సంధ్యారాణిని అడ్డగించాడు. తనను పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేశాడు. దీంతో ఇరువురి మధ్యా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆమె నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. సంధ్యతో మాట్లాడటానికి వచ్చే వ్యక్తి తన వెంట పెట్రోల్ బాటిల్‌ను తీసుకురాడని, సంధ్యను హత్య చేయాలని కార్తీక్ ముందే పథకం వేసుకున్నాడని, అందుకే పెట్రోల్‌తో వచ్చాడని పోలీసులు తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ కమిటీ కాగా, సంధ్యారాణికి వైద్యసేవలు అందించడంలో సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు తమతో అనుచితంగా ప్రవర్తించారని మృతురాలి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ ఆర్ఎంఓ–1 జయకృష్ణ, నర్సింగ్ సూపరింటెండెంట్ మంగమ్మతో కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. మరణ వాంగ్మూలం నమోదు తీవ్ర గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చేరిన సంధ్యారాణి మరణ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేసినట్లు డీసీపీ సుమతి చెప్పారు. తనను ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా వెంటపడుతున్న కార్తీక్.. తాను తిరస్కరించడంతో కక్షగట్టి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు బాధితురాలు పేర్కొందని తెలిపారు. వీలైనంత త్వరగా కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేసి, నిందితుడిపై నేరం నిరూపణ అయ్యేలా ప్రయత్నిస్తామని చెప్పారు. కనిపించని పశ్చాత్తాప ఛాయలు.. సంధ్యారాణి హత్య కేసు లాలాగూడ ఠాణాలో నమోదైంది. నార్త్‌జోన్ డీసీపీ సుమతి విలేకరుల సమావేశాన్ని బొల్లారం పోలీసుస్టేషన్లో నిర్వహించారు. దీంతో పోలీసులు కార్తీక్‌ను తమ వాహనంలో అక్కడకు తీసుకువచ్చారు. ఇలా వస్తున్నప్పుడు, మీడియా సమావేశం తర్వాత, తిరిగి తీసుకువెళ్తున్నప్పుడు మీడియా అతడితో మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ స్పందన లేదు. ఆద్యంతం తన ముఖానికి కర్చిఫ్ కట్టుకుని ఉన్న కార్తీక్‌లో ఏమాత్రం పశ్చాత్తాప ఛాయలు కనిపించలేదు. గాంధీమార్చురీ వద్ద రోధిస్తున్న తల్లి సావిత్రి, బంధువులు -
ఆరని నిరసన జ్వాల
-
డాక్టర్ లక్ష్మీ అరెస్టు ఇంకెప్పుడు..?
గుంటూరు మెడికల్: ప్రొఫెసర్ ఏవీవీ లక్ష్మిని అరెస్ట్ చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. శుక్రవారం జూడాలు లక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆస్పత్రి చుట్టూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూడాల సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మి వేధింపులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఆమెకు ఉన్న పలుకుబడిని తట్టుకోలేక సదరు ప్రొఫెసర్ బదిలీ చేయించుకొని వెళ్లారని, నేడు డాక్టర్ లక్ష్మి వేధింపులపై సాక్ష్యం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పీజీ వైద్య విద్యను పూర్తి చేసుకున్న వారు, కొందరు రోగులు డాక్టర్‌పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైద్యులతోపాటు ఆయాలు, నర్సులు, రోగులందరూ ప్రొఫెసర్ లక్ష్మి దూషణలపై ఫిర్యాదు చేస్తున్నా ఎందుకు ఆమెను అరెస్ట్ చేయరంటూ ప్రశ్నించారు. రోగులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తమకు లేదని, న్యాయం కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ముగ్గురు వైద్యులతో కూడిన హైపవర్ కమిటీ శుక్రవారం కూడా జీజీహెచ్ వైద్యులు, వైద్య సిబ్బంది విచారించింది. -
ఆరని నిరసన జ్వాల
* సంధ్యారాణి మృతికి కారణమైన ఫ్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలని కొనసాగుతున్న ధర్నా * లేదంటే నిరసన కొనసాగిస్తాం * జూడాల సంఘం వెల్లడి * నగరంలో భారీ ర్యాలీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్యకు కారకురాలైన గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.వి.వి.లక్ష్మిని అరెస్టు చేసేంతవరకు సమ్మె కొనసాగిస్తామని గుంటూరు జీజీహెచ్ జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. గురువారం మృతురాలి చిత్రపటాలను పట్టుకుని.. నల్లబ్యాడ్జీలు ధరించి నగరంలో ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలను కలిసి న్యాయం కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. గుంటూరు మెడికల్: డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఏవీవీ లక్ష్మిని అరెస్టు చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని గుంటూరు జీజీహెచ్ జూనియర్ డాక్టర్లు(జూడా) స్పష్టం చేశారు. గురువారం డాక్టర్ సంధ్యారాణి చిత్రపటాన్ని పెట్టుకుని, నల్లబ్యాడ్జిలు ధరించి, డాక్టర్ లక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గుంటూరు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఆస్పత్రి నుంచి హిందూ కళాశాల మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు వెళ్లి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. తొలుత బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజామున 3 గంటల వరకు సూపరింటెండెంట్ చాంబర్ వద్దే నేలపై బైఠాయించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ సుబ్బారావు జీజీహెచ్‌కు వచ్చి జూడాలతో మాట్లాడారు. తొలుత ఏర్పాటు చేసిన కమిటటీపై తమకు నమ్మకం లేదని జూడాలు చెప్పటంతతో ముగ్గురు సభ్యులతో హైపవర్ కమిటీ వేశామని వెల్లడించారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శశాంక్, విజయవాడ జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్, నెల్లూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ భారతి హైపవర్ కమిటీలో ఉన్నారని తెలిపారు. డీఎంఈ చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని జూడాలు ప్రొఫెసరల్ లక్ష్మిని అరెస్ట్ చేసే వరకు తమ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆస్పత్రి వర్గాలంతా లక్ష్మిపై ఫిర్యాదు... ఆసుపత్రిలో జూడాలు చేస్తున్న సమ్మెకు ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం నేతలు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం మద్దతుగా గంటసేపు నిరసన తెలిపారు. వీరు డాక్టర్ లక్ష్మిపై డీఎంఈకి ఫిర్యాదు చేశారు. బహిరంగ విచారణలోనైనా ఆమెపై ఫిర్యాదు చేస్తామన్నారు. తదుపరి డీఎంఈ ఆస్పత్రి అధికారులు, ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పోలీస్ అధికారులతో చర్చించి వెళ్లిపోయారు. అడిషనల్ ఎస్పీ భాస్కరరావు, డీఎస్సీలు సరిత, సంతోష్ ఆస్పత్రికి వచ్చి జూడాలతో చర్చించారు. లక్ష్మిని తక్షణమే అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు వివరించారు. హైపవర్ కమిటీ విచారణ హైపవర్ కమిటీ సభ్యులు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ప్రొఫెసర్ లక్ష్మిపై వస్తున్న ఆరోపణల గురించి విచారణ చేశారు. వైద్యుల నుంచి రోగుల వరకు ఆస్పత్రిలో అందరితో మాట్లాడారు. 24 గంటల్లో అరెస్టు చేయకపోతే ఎమర్జెన్సీ సేవలు నిలిపేస్తాం.. గురువారం అత్యవసర సేవలు మినహా మిగతా వైద్య సేవలకు హాజరైన జూనియర్ డాక్టర్లు ప్రొఫెసర్ లక్ష్మిని 24 గంటల్లో అరెస్టు చేయకపోతే అత్యవసర వైద్య సేవలను నిలిపివేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.